Home » వింటేజ్ లుక్స్‌లో వింకీ పిల్ల.! ప్రియా ప్రకాష్ వారియర్ న్యూ అవతార్.!

వింటేజ్ లుక్స్‌లో వింకీ పిల్ల.! ప్రియా ప్రకాష్ వారియర్ న్యూ అవతార్.!

by Mudra369 Editorial Desk
0 comments
Priya Prakash Varrier

Priya Prkash Varrier Wintage.. తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును కొల్లగొట్టేసిన వింక్ పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్ న్యూ గెటప్‌లో దర్శనమిచ్చింది.

ఇదేమీ సినిమా గెటప్ కాదండోయ్. జస్ట్ ఫోటో షూట్ అంతే.!

ఒక్క సినిమాతోనే.. కాదు కాదు ఒక్క సీన్‌తోనే రాత్రికి రాత్రి సెన్సేషనల్ అయిపోయిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. దాంతో ఆమె పేరు తెలియని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.

సంచలనం అయితే అయ్యింది కానీ ఆ స్థాయి అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది ప్రియా ప్రకాష్ వారియర్.

ఏదో ఒకటీ అరా సినిమాల్లో నటించింది తెలుగులో. అలాగే మలయాళంలోనూ.

Priya Prakash Varrier
Priya Prakash Varrier

కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ బిజీగా వుంటుంది తనదైన స్టైల్ ఫోటో షూట్స్‌తో. తన సెన్సేషన్‌ని యూజ్ చేసుకోవాలి కదా.! అందుకేనేమో నెట్టింట యమా యాక్టివ్ ఈ వింక్ పిల్ల.

తాజాగా ఓ న్యూ గెటప్‌లో ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయ్. అచ్చమైన పల్లె పడుచులా ముస్తాబైంది ఈ ఫోటో షూట్ కోసం ప్రియా ప్రకాష్ వారియర్.

Priya Prkash Varrier Wintage.. మట్టి కుండతో ముగ్ధ మనోహరమ్.!

ఎల్లో కలర్ ట్రెడిషనల్ లెహెంగాకి ట్రెడిషనల్‌గానే బ్లౌజ్ కూడా ధరించింది. అయితే కాస్త డీప్ నెక్ కావడంతో గ్లామరస్ లుక్స్ ఎలివేట్ అవుతున్నాయనుకోండి.!

ఆ సంగతి అటుంచితే, చక్కనమ్మ అన్నాకా.. ఆ మాత్రం చేయాల్సిందే ముద్దుగుండాలంటే.! చేతిలో మట్టి కుండ పట్టుకుని ప్రియా ప్రకాష్ ఇచ్చిన పోజుెలు వింటేజ్ లుక్స్‌ని తలపిస్తున్నాయ్.

అలాగే ధరించిన ఆభరణాలు వేసిన మేకప్ అంతా కూడా ఓ వైపు ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే మరోవైపు కాంటెంపరరీ స్టైల్‌నీ అద్భుతంగా సెట్ చేస్తున్నాయ్.

నుదుట ధరించిన ఎర్రటి బొట్టు, చేతులకు మట్టి గాజులు ఆమె ముఖాన్ని టోటల్ లుక్‌నీ చాలా నేచురల్‌గా మార్చేశాయ్. కళ్లకు పెట్టిన ఐ లైనర్ మరింత ఆకర్ణణీయంగా కనిపిస్తోంది.

జుట్టును మొత్తం పైకి లాగి దువ్వినట్టుగా స్లైలింగ్ చేసి, దానికి ముత్యాల దండలు అల్లారు. ఈ స్టైలింగ్ ప్రియా ప్రకాష్ వారియర్ లుక్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.

మౌనీ రాయ్ బ్యూటిఫుల్ ఫోటోస్‌ని ఈ ‘స్టోరీ’లో చూడండి..

ఏది ఏమైనా ఆ వింటేజ్ బ్యాక్ డ్రాప్ట్‌కి ఆమె నడుముపై ఒదిగిపోయిన ఆ మట్టి కుండ టోటల్ ఫ్రేమ్‌కే హైలైట్ అయ్యింది.

అలానే ఆమె కాలర్ బోన్‌పై వున్న టాటూలు, చేతిపై అక్కడక్కడా వున్న టాటూలు ప్రత్యేకంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయ్.

ఇటుకల గోడ.. సన్నని సూర్య కిరాణాలు.. మట్టి గాజులు, మట్టి కుండ, ఆమె కొప్పు ముడి.. ఇలా అన్నీ కలగలిపిన ఈ కాన్సెప్ట్ ఫోటోగ్రఫీ వేరే లెవల్ వయ్యారమ్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group