Home » సినిమా కోసం సెలవిచ్చారు.! బొత్తిగా సిగ్గొదిలేశారు.!

సినిమా కోసం సెలవిచ్చారు.! బొత్తిగా సిగ్గొదిలేశారు.!

by Mudra369 Editorial Desk
0 comments
Preethi Reddy Aadarsha Kutumbam

Aadarsha Kutumban Preethi Reddy.. ఇంజనీరింగ్ కాలేజీల్ని మూసేసి, సినిమాల్లోకి వెళ్ళిపోతే బావుంటుందేమో.! మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి గురించి అంతటా జరుగుతున్న చర్చ ఇది.!

మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ‘చదువులెలా వుంటాయ్.?’ అన్నదానిపై, అందరికీ ఓ అవగాహన వుంది. చదువుల కంటే, సినిమాల మీద శ్రద్ధ ఎక్కువైపోతోంది, ఈ సంస్థ యాజమాన్యానికి.

మరీ ముఖ్యంగా గత కొంత కాలంగా ప్రీతి రెడ్డి, సినిమాలపై మక్కువ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి క్యాంపస్, సినిమా ఈవెంట్లకు కేరాఫ్ అడ్రస్ అయిపోతోంది.

‘టాక్సిక్’ అనే ఓ దారుణమైన సినిమాకి సంబంధించిన ఈవెంట్, ఈ మల్లారెడ్డి విద్యా సంస్థలోనే జరిగింది. తాజాగా, ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్ ఇక్కడ నిర్వహించారు.

సరే, ఈవెంట్లు నిర్వహించడం తప్పేమీ కాకపోవచ్చు. కానీ, సినిమాల కోసం విద్యా సంస్థకి సెలవు ప్రకటించడమేంటి నాన్సెన్స్ కాకపోతే.?

‘ఆదర్శ కుటుంబం’ విడుదల నేపథ్యంలో, కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నామంటూ, ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే వెల్లడించారు ప్రీతి రెడ్డి.

టాలీవుడ్ నుంచి ప్రతి శుక్రవారం సినిమాలొస్తుంటాయ్. వారానికి ఒకటి, రెండు.. ఆపైన సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ లెక్కన, సినిమాలకు సెలవులు ప్రకటించుకుపోతూ వుంటే ఎలా.?

సినిమాల్ని, విద్యా సంస్థల్లో ప్రమోట్ చేయడమే నాన్సెన్స్.! అంటే, విద్యార్థులు సినిమాలని చూడకూడదని కాదు.! చూడొచ్చు, అది వాళ్ళ ఇష్టం.

చాలా సినిమాల్ని, ‘జెన్ జీ’ కోసమే తీస్తున్న దరిమిలా, విద్యా సంస్థల్లో సినిమాల్ని ప్రమోట్ చేయడానికి సినీ జనాలు ఆసక్తి చూపడంలో వింతేమీ లేదు.

కాకపోతే, అది విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇటు సినీ జనాలు, అటు విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి.

విద్యని వ్యాపారంగా మార్చేసిన ప్రీతి రెడ్డి లాంటోళ్ళకి, విలువలెలా తెలుస్తాయ్.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group