Sharmila Daughter Wedding Controversy.. కాదేదీ వివాదానికి అనర్హం.. అన్నట్లుగా మారింది పరిస్థితి.!
వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇంట పెళ్ళి జరగనుంది. షర్మిల కుమార్తె పెళ్ళి నేపథ్యంలో, అతిథులకు ఆహ్వానాలు వెళుతున్నాయి.
అయితే, పెళ్ళెక్కడ.? అన్నదానిపై వివాదం రాజుకుంది. బెంగళూరులోని యెలహంక ప్యాలెస్లో వివాహం.. అనే ప్రచారం తొలుత జరిగింది. కానీ, అది కాదు.. వేరే వేదిక.. అంటూ, ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.
షర్మిల తలచుకుంటే, అంగరంగ వైభవంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కడో ఓ చోట.. ఈ వివాహ వేడుకను నిర్వహించుకోవచ్చు. పొరుగు రాష్ట్రాల్లో వేడుక నిర్వహించుకోవాన్నీ తప్పు పట్టలేం.
అయితే, షర్మిల కుమార్తె పెళ్ళిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన యెలహంక ప్యాలెస్లో జరపాలని నిర్ణయించుకున్నారన్న ప్రచరామే అసలు వివాదానికి కారణం.
తెలిసిందే కదా, వైఎస్ జగన్, షర్మిల మధ్య విభేదాలున్నాయని. అన్న జగన్, తనను రాజకీయంగా వాడుకుని వదిలేశారన్నది చెల్లెలు షర్మిల ఆరోపణ.
ఆస్తుల పంపకాలు సహా, అనేకానేక వివాదాలు ఇద్దరి మధ్యా వున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఈ క్రమంలో అసలు మేనకోడలి వివాహ వేడుకకి జగన్ హాజరవుతారా.? లేదా.? అన్న అనుమానాలూ తెరపైకొస్తున్నాయి. ఇంత గొడవ జరిగాక, జగన్ వెళ్లకపోవచ్చు కూడా.
అయితే, ఇదంతా జగన్ – షర్మిల.. ఈ ఇద్దరికీ మాత్రమే సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం.. వారి కుటుంబ అంతర్గత వ్యవహారం.!
కానీ, ఇద్దరూ రాజకీయ రంగంలో ప్రముఖులు గనుక, మీడియా అత్యుత్సాహం సహజమే.
ఆనందోత్సాహాల నడుమ జరగాల్సిన పెళ్ళి వేడుక చుట్టూ ఈ రాజకీయ వివాదం, కాబోయే దంపతులకు చికాకు కలిగిస్తుందన్నది నిర్వివాదాంశం.
అటు జగన్, ఇటు షర్మిల, ఇంకోపక్క వీరిద్దరి తల్లి విజయమ్మ.. ఎవరూ, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమే చేయడంలేదు.
ఈ వ్యవహారంలో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదం. అదే సమయంలో వైసీపీ నాయకులు, షర్మిలపై విమర్శలు చేయడం.. ఇంకా దారుణం.