Chennai Love Story Review.. నాలుగు ముద్దు సీన్స్.. అవి కూడా లిప్ లాక్స్.. వాటికి తోడు హాట్ అండ్ వైల్డ్ రొమాంటిక్ సీన్స్.. ఇదీ ఇప్పటి ‘యూత్‌ఫుల్’ సినిమాల కాన్సెప్ట్.!
అంతేనా.? ఇంకేమీ లేదా.? లేకనేం, చాలా వుంది. సినిమా అంటే, కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని చూడగలిగేది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది.
ట్రెండ్ మారింది కదా.! కొన్ని యూత్‌ఫుల్ సినిమాలు.. కొన్ని, అసలంటూ పిల్లలు చూడకూడని సినిమాలు.. బాగా పెద్దవాళ్ళు కూడా చూడాల్సిన అవసరం లేని సినిమాలొస్తున్నాయ్.
ఏం, ప్రేమ కథల్ని పెద్దవాళ్ళు ఎందుకు చూడకూడదు.? పిల్లలు ఎందుకు చూడకూడదు.? అంటే, ప్రేమ కథల్ని అంత ఛండాలంగా తయారు చేసేశారు కాబట్టి.
Chennai Love Story Review.. చెన్నై లవ్ స్టోరీ కథా కమామిషు ఇదీ..
ఇంతకీ, ‘చెన్నై లవ్ స్టోరీ’ ఏ తరహా సినిమా.! ప్రేమలో విఫలమైతే, అమ్మాయి పరిస్థితేంటి.? దేవదాసులా ఈ అమ్మాయీ లిక్కర్ కిక్కుతో ‘బ్రేకప్’ బాధ నుంచి బయటపడాలని ప్రయత్నించడమేంటి.?
అనుకోకుండా ఆ అమ్మాయికి, ఇంకో అబ్బాయి తారసపడి, ఆమెకి బానిసత్వం చేయడమేంటి.? ఇదంతా ఇటు ఫన్, అటు ఎమోషన్ కోణంలో చూపిస్తే, ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యిందా? లేదా?
హీరోయిన్, ప్రేమలో విఫలమై లిక్కర్‌కి బానిసయ్యింది కాబట్టి, హాట్ కంటెంట్‌తో సినిమా వైల్డ్‌గా తీసెయ్యొచ్చు. కానీ, హీరో చాలా మంచోడు.. పైగా, అనాధ. అందునా, ‘బానిస’ మనస్తత్వం వున్నోడు.
సో, అడ్వాంటేజ్ తీసుకోలేదు. అయినాసరే, అమ్మాయి అతని ప్రేమలో పడుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. ఇంతలోనే పెద్ద ట్విస్ట్.. చాలా పెద్ద ట్విస్ట్.
పెళ్ళికి కొద్ది క్షణాల ముందు యాక్సిడెంట్‌లో చనిపోతాడు మన ‘బానిస’ హీరో.! అంతే, హీరోయిన్ జీవితంలో మళ్ళీ చీకటి. ఆ తర్వాత ఏమవుతుందన్నది మిగతా కథ.
వెండితెరపై చూడాల్సిన సినిమానే ఇది. విజువల్స్ అంత రిచ్‌గా వున్నాయి. మ్యూజిక్ కూడా అంతే. నటీనటుల పెర్ఫామెన్స్ కూడా వెండి తెరపై చూస్తే, మాంఛి కిక్ లభిస్తుంది.
శ్రీగౌరి ప్రియ, చాలా బాగా నటించింది. ఆమె నటనకి మంచి మార్కులు పడతాయ్. ఇంకా మంచి మంచి పాత్రలు ఆమెకు పడితే, తెలుగు తెరకు మంచి హీరోయిన్ దొరికినట్లే.
హీరో విషయానికొస్తే, కిరణ్ అబ్బవరం చాలా సెటిల్డ్‌గా చేసిన సినిమా అది. ఆ పాత్రే కనిపిస్తుంది తప్ప, కిరణ్ అబ్బవరం అనే హీరో కనిపించడు.. సినిమా మొత్తమ్మీద.
అక్కడక్కడా డైలాగుల్లో కొంత అతి, అతని యాక్టింగ్‌లోనూ కొంచెం ఓవర్ ది బోర్డ్ అనిపించినా, ఓవరాల్‌గా ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇప్పటిదాకా కిరణ్ అబ్బవరం కెరీర్‌లో.
మిగతా పాత్రధారులంతా కథకి అవసరమైనంత మేర బానే చేశారు. ఎవ్వరూ మరీ ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోలేదు. కాకపోతే, హీరోయిన్ తాగుడు వ్యవహారం, ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంది.
హీరోయిన్ చిరాకు పడే సందర్భాల నిడివి కొంత తగ్గించి వుండాల్సింది. అలా చేసి వుంటే, సినిమాకి ఇంకాస్త బెటర్ రిజల్ట్ వచ్చి వుండేదేమో.
తొలిప్రేమే తోపు కాదు.. అన్న సందేశం బావుంది. అయితే, సినిమాల్లో ఇచ్చే సందేశాల్ని ప్రేక్షకులు రియల్ లైఫ్‌కి అన్వయించుకోరనుకోండి.. అది వేరే విషయం.
టెక్నికల్‌గా చూసుకుంటే..
సినిమాకి మ్యూజిక్ ప్రాణం అనొచ్చు. మణిశర్మ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, డైలాగ్స్.. అన్నీ బావున్నాయి. ఎడిటింగ్ కూడా బావుంది. కొన్ని సీగతీత సన్నివేశాల్ని కొంతవరకు ట్రిమ్ చేసి వుంటే బావుండేది.
అవసరమైనంత మేర సినిమాకి బాగానే ఖర్చు చేశారు. ఖర్చు విషయంలో పెద్దగా రాజీ పడలేదు. తాను ఏ కథ తెరకెక్కించాలనుకున్నాడో, ఆ కథ మీద దర్శకుడు బాగానే వర్క్ చేశాడు. డీవియేషన్స్ లేవు.
దర్శకుడి సిన్సియర్ ఎఫర్ట్ ఆకట్టుకుంటుంది. అవకాశం వున్నాగానీ లిప్ లాక్స్ జోలికి వెళ్ళలేదు. వల్గర్ కంటెంట్ వైపు చూడలేదు.
చాలా అరుదుగానే ఇలాంటి క్లీన్ సినిమాల్ని చూస్తుంటాం. పాత సినిమాలు కొన్ని గుర్తుకొస్తుంటాయ్ సినిమా చూస్తున్నంతసేపూ. అయినాసరే, ఫ్రెష్ ఫీల్ వస్తుంది సినిమా చివరి వరకూ.
