Lenin Nagarjuna Slams Delay.. ‘లెనిన్’ సినిమా హిట్టయ్యింది. నిర్మాత అక్కినేని నాగార్జున సంతోషంగా వున్నారు.
వుంటారు మరి.! ఓ వైపు నిర్మాతగా హ్యాపీ.. ఇంకో వైపు, తనయుడు అఖిల్‌కి హిట్టొచ్చినందుకూ హ్యాపీ.
అంతా హ్యాపీయేనా.? ప్చ్.. కష్టాలూ వున్నాయ్. ఆ కష్టాల్నే తాజాగా ఏకరువు పెట్టారు అక్కినేని నాగార్జున. ‘లెనిన్’ సినిమాకి సంబంధించిన తాజా ఈవెంట్‌లో, నాగార్జున తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
విషయమేంటంటే, ‘లెనిన్’ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేదు. వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది ‘లెనిన్’.!
స్వయంగా అక్కినేని నాగార్జున ప్రకటించిన డేట్ కూడా మారిపోయింది. హాలీవుడ్ సినిమా ‘అబ్సెషన్’, ఏడాది ముందర రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు.
Lenin Nagarjuna Slams Delay.. తెలుగు సినిమాకే ఎందుకీ కష్టం.?
‘అబ్సెషన్’ సినిమాలా మనమెందుకు చెప్పిన డేట్‌కి సినిమా రిలీజ్ చెయ్యలేకపోతున్నాం.? అని అక్కినేని నాగార్జున ప్రశ్నించారు.
అక్కినేని నాగార్జున అంటే తెలుసు కదా.? స్టార్ హీరో మాత్రమే కాదు, ప్రముఖ నిర్మాత కూడా.! ఓ స్టూడియో అధినేత.
పైగా, సాంకేతికంగా సినిమాకి సంబంధించిన చాలా వ్యవహారాల్ని ఇప్పుడు అన్నపూర్ణా స్టూడియోస్ టేకప్ చేస్తోంది. సో, నాగార్జునకి అన్నీ తెలుసు.
తెలిసీ, సినిమా ఎందుకు ఆలస్యమవుతోందో తెలియనట్లు అక్కినేని నాగార్జున ఆవేదన వ్యక్తం చేయడమేంటి.? ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గర సినిమా ఆలస్యమవుతోంది.
వీఎఫ్ఎక్స్ సంగతి సరే సరి.! చెప్పుకుంటూ పోతే, చాలానే వున్నాయ్ సమస్యలు.
నెల రోజుల ముందు.. సాధ్యమేనా.?
‘సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యాక, ఆ డేట్‌కి కనీసం నెల రోజుల ముందు.. పోనీ, పదిహేను రోజుల ముందు సినిమా ఇచ్చెయ్యండి’ అన్నది నాగార్జున సూచన.
నిజానికి, ఇది జస్ట్ సూచన కాదు. ఓ నిర్మాత ఆవేదన. ఆయన ఆవేదనలో అర్థం వుంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? ఇదొక మిలియన డాలర్ క్వశ్చన్.
చివరి నిమిషం వరకు సినిమాని చెక్కే దర్శకులు.. అనగా, రీషూట్లు చేస్తారన్నమాట.! మరి, దర్శకుల వైపు నుంచి ఆలస్యం వున్నప్పుడు, వీఎఫ్ఎక్స్ అలానే ఎడిటింగ్ ఆలస్యమయిపోతుంది కదా.?
సమస్య తెలుసు, సమస్యకి పరిష్కారమూ తెలుసు. కానీ, పరిష్కరించలేని సమస్యగా మారిపోయిందిది.
