Home » రంగుల గాజుల్.. సిగ్గుల మొగ్గల్.. యుక్తి తరేజా రీఫ్రెషింగ్ పోజుల్.!

రంగుల గాజుల్.. సిగ్గుల మొగ్గల్.. యుక్తి తరేజా రీఫ్రెషింగ్ పోజుల్.!

by Mudra369 Editorial Desk
0 comments
Yukti Thareja

Yukti Thareja Refreshing Beauty.. నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హర్యానా బ్యూటీ యుక్తి తరేజా.

ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యుక్తి తరేజాకి కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగంపై మక్కువ ఎక్కువ.

ఆ మక్కువతోనే కాలేజీ ఈవెంట్స్‌లో చాలా చురుకుగా పాల్గొనేది. ర్యాంప్ వాక్‌లో తనదైన కాన్ఫిడెన్స్ ప్రదర్శించేది. ఎంటీవీ కండెక్ట్ చేసిన ప్రముఖ రియాల్టీ షో ‘మోడల్ ఆఫ్ ద ఇయర్ 2019’లో వన్ ఆఫ్ ది టాపర్స్‌గా నిలిచింది.

ఆ తర్వాత సినిమాల్లో సత్తా చాటింది. తొలి సినిమా ‘రంగబలి’తోనే తనదైన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్.. ప్లెజెంట్ ఫీచర్స్‌తో తెలుగు యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసింది.

తర్వాత కిరణ్ అబ్బవరంతో ‘k RAMP’ సినిమాలోనూ యుక్తి తరేజా నటించింది. మోడలింగ్ నుంచి వచ్చింది కదా.! డాన్సుల్లో మంచి గ్రేస్ ప్రదర్శిస్తుంటుంది యుక్తి తరేజా.

Yukti Thareja Refreshing Beauty.. మ్యూజిక్ వీడియోస్ అంటే ప్రాణం

కెరీర్ తొలినాళ్లలో ‘లుట్ గయే’ మ్యూజిక్ ఆల్బమ్‌తో యుక్తి తరేజా పాపులర్. బిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది యుక్తి నటించిన ఈ మ్యూజిక్ ఆల్బమ అప్పట్లో.

ఆ ఇంట్రెస్ట్‌తోనే ఇప్పటికీ మ్యూజిక్ ఆల్బమ్స్ అంటే ఎగిరి గంతేస్తుంటుంది. ఏ చిన్న అవకాశమొచ్చినా వదిలిపెట్టదు.

ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటూ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ అవకాశాలూ దక్కించుకుంటోంది.

Yukti Thareja
Yukti Thareja

హిందీలో మ్యూజిక్ రిలేటెడ్ వెబ్ సిరీస్ ‘హాయ్ జునూన్’ తదితర వెబ్ సిరీస్‌లలో యుక్తి నటించింది.

సినిమాలూ, వెబ్ సిరీసులతో పాటూ, కమర్షియల్ యాడ్స్‌లోనూ నటిస్తూ పలు బ్రాండ్స్ ప్రమోషన్స్‌తో బిజీగా వుంది యుక్తి తరేజా.

అరవిరిసిన పువ్వులా.. పుత్తడి బొమ్మలా..

మెటల్ గాజులు వేసుకోవడమే ట్రెండ్ కాదండోయ్. ఈ మధ్య రంగు రంగుల మట్టి గాజులు ధరించడం కూడా యూత్ ట్రెండ్‌లాగే చూసస్తున్నారు.

డ్రస్‌కి మ్యాచింగ్‌తో పని లేదు. మల్టీ కలర్ రంగు రంగుల గాజులతో మెప్పిస్తున్నారు. అలాగే యుక్తి తరేజా కూడా తన డ్రస్‌కి కాంట్రాస్ట్‌గా రంగు రంగుల మట్టి గాజులు ధరించి ట్రెండ్ సెట్ చేసింది.

Yukti Thareja
Yukti Thareja

బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబో ఓంబ్రే లెహెంగాలో యుక్తి తరేజా పోజులు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయ్. నేచురల్ పువ్వుల పోజుల్‌తో పుత్తడి బొమ్మలా మురిపిస్తోంది.

యుక్తి తరేజా ఈ రీఫ్రెషింగ్ పోజులు నెట్టింట్లో మంచు తుఫాను పుట్టిస్తున్నాయ్. ‘మేరా దిల్ లుట్ గయా..’ అంటూ యుక్తి క్రేజీ పోజులకు నెటిజనం మనసు పారేసుకుంటోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group