Home » నీట్ పరీక్ష అంటే.! సగటున లక్షన్నర కోట్ల ‘విద్యా’ వ్యాపారం.!

నీట్ పరీక్ష అంటే.! సగటున లక్షన్నర కోట్ల ‘విద్యా’ వ్యాపారం.!

by hellomudra
0 comments
NEET Exam Leak Scam

NEET Exam Leak Scam.. వైద్య విద్యను అభ్యసించాలంటే, ‘నీట్’ పరీక్ష తప్పనిసరి.!

జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ చేయడానికి ‘జీ మెయిన్స్’, ‘జీ అడ్వాన్స్‌డ్’ వంటి పరీక్షలు రాయాల్సి వుంటుంది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘నీట్’ పరీక్ష గురించిన చర్చ జరుగుతోంది గనుక, ‘నీట్’ గురించే ప్రస్తుతం మనం ఇక్కడ మాట్లాడుకుందాం.

సగటున ఒక్కో విద్యార్థీ ‘నీట్’ పరీక్ష కోసం రెండేళ్ళపాటు, అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలాగే రెండో సంవత్సరం.. దాంతోపాటుగా, నీట్ కోచింగ్ కోసం చేసే ఖర్చు ఎంత.?

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఖర్చు చాలా చాలా తక్కువ. అదే, చిన్నా చితకా ప్రైవేటు కళాశాలలు అయితే, అటూ ఇటూగా లక్ష ఖర్చు చేయాల్సి వుంటుంది.

కార్పొరేట్ కాలేజీలకు వెళితే, డే-స్కాలర్స్ ఖర్చుకి డబుల్ వుంటుంది రెసిడెన్షియల్ విద్యార్థులకి. ఇది సుమారుగా రెండేళ్ళకు ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా కూడా వుండొచ్చు.

ప్రైవేటు కాలేజీ, ఓ మోస్తరు ఖర్చుల్ని లెక్కల్లోకి తీసుకుంటే, మొత్తంగా ఈ ఏడాది నీట్ రాసిన విద్యార్థుల సంఖ్యతో పోల్చి చూసినప్పుడు దాదాపు లక్షన్నర కోట్ల ఖర్చు తేలుతోంది.

NEET Exam Leak Scam.. లక్షన్నర కోట్ల వ్యాపారం..

గత ఏడాది రాసినవాళ్ళలో చాలామంది ఈ ఏడాది కూడా రాస్తారు కదా.? అంటే, అది కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం పైన చెప్పుకున్న దాదాపు లక్షన్నర కోట్లన్నమాట.

నిజానికి, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 5 లక్షల నుంచి పది లక్షల ఫీజు కోణంలో చూస్తే, తడిసి మోపెడైపోతుంది. అప్పుడది నాలుగు లక్షల కోట్ల నుంచి పది లక్షల కోట్లను టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సో, ఇది ఓ లాభసాటి వ్యాపారం అన్నమాట.! అందుకే, ‘నీట్’ పరీక్ష తరచూ వివాదాస్పదమవుతుంటుంది. జీ-మెయిన్స్, జీ- అడ్వాన్స్‌డ్ వ్యవహారం వేరు.

వరుసగా రెండేళ్ళు మాత్రమే జీ-మెయిన్స్, జీ-అడ్వాన్స్‌డ్ పరీక్షలకు అనుమతి వుంటుంది. ప్రత్యమ్నాయంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని రాష్ట్రాల్లో వున్నాయి.

ఇంటర్మీడియట్ కోసం పెద్దగా ఖర్చు చేయకుండా, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో డబ్బులు ఖర్చు చేసి సీట్ కొనేసుకునేవారు కోకొల్లలు.

ఇంజనీరింగ్, మెడిసిన్ మధ్య వున్న తేడా ఇదే. మెడిసిన్ చేయాలంటే, నీట్ రాయాల్సిందే. నీట్ పరీక్ష రాయడానికి వయోపరిమితి లేదు.

ప్రైవేటు మెడికల్ కాలేజీలో ప్రైవేటుగా సీటు కొనాలంటే, తక్కువలో తక్కువ ఏడాదికి 1‌0 లక్షల పైనే ఖర్చు. సో, నీట్ విషయమై ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కోచింగ్ తప్పనిసరి.

ఇక్కడే ‘లీక్’కి అవకాశాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. లక్షన్నర కోట్ల పైన వ్యాసారం గనుక, అక్రమార్కులు ‘మ్యానిప్యులేషన్’ చేయడానికి, ఓ రేంజ్‌లో ఖర్చు చేస్తున్నారు.

నీట్ నిర్వహణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా…

పరీక్ష నిర్వహణలో ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, లీకులో ఇతర సమస్యలో ‘నీట్’ విషయంలో వస్తున్నది ఇందుకే. పైగా, నీట్ పరీక్ష అనేది రాత పూర్వకమైనది.

జీ-మెయిన్స్, జీ-అడ్వాన్స్‌డ్ అనేవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. వాటికి సంబంధించిన కోచింగ్, అది మళ్ళీ వేరే దోపిడీ. అదేమీ తక్కువ కాదు. దాని గురించి ఇంకోసారి చర్చించుకుందాం.

నీట్ త్వరలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబోతోంది. అప్పుడిక లీక్ అవకాశాల దాదాపుగా తగ్గిపోతాయ్.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం, నీట్ లీక్ నిందితుల్ని శిక్షించడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవడం.

ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. సో, ఆందోళన విరమించడం మంచిది ‘నీట్’ విద్యార్థులు.

అన్నట్టు, విద్యార్థుల ఆందోళనలోకి కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని అసాంఘీక శక్తులు దూసుకొచ్చి, విషయాన్ని రాజకీయం చేసి పారేశాయి. ఇదే అత్యంత బాధాకరమైన విషయం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group