Home » నా శరీరం.. నా సైజ్.. నా ప్రైడ్.! పాయల్ రాజ్‌పుత్‌కి ఏమైందసలు?

నా శరీరం.. నా సైజ్.. నా ప్రైడ్.! పాయల్ రాజ్‌పుత్‌కి ఏమైందసలు?

by Mudra369 Editorial Desk
0 comments
Payal Rajput

Payal Rajput Body Shaming.. సోషల్ మీడియాలో కంటెంట్ వైరల్ అవ్వాలంటే, తేలికైన మార్గం సెలబ్రిటీలను ట్రోల్ చేయడం.!

మరీ మఖ్యంగా హీరోయిన్ల వీడియోల్ని ఏఐ ద్వారా ఎడిట్ చేస్తే, వాటికి లభించే రీచ్ వేరే లెవల్ అంతే.! సాధారణ వీడియోల్నే, జుగుప్సాకరంగా చూపించగలిగితే.. వాటికి తిరుగుండదు.

‘వద్దు మొర్రో’ అని సెలబ్రిటీలు ఎంత మొత్తుకుంటున్నా ఈ ట్రోలింగ్ ఆగడం లేదంటే, దానికి కారణం ఆ ‘రీచ్’.! సినిమా ఫంక్షన్లలో హీరోయిన్లని అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు కొందరు కెమెరామెన్లు.

ఇక్కడ కెమెరామెన్లు అంటే, మొబైల్ ఫోన్ చేతిలో వున్న ప్రతి ఒక్కరూ కెమెరామెన్లే.! హై ఎండ్ మొబైల్స్‌తో పిక్చర్ క్లారిటీ వేరే లెవల్ వుంటోంది మరి.!

Payal Rajput Body Shaming.. స్మార్ట్ కెమెరాల అసభ్యకరమైన కంటెంట్..

అందుకే, ప్రొఫెషనల్ కెమెరామెన్ల స్థానంలో, ఈ స్మార్ట్ కెమెరామెన్లు ఎక్కువైపోయారు. ఫలితం, అసభ్యకరమైన కంటెంట్ సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా పెరిగిపోతుండడం.

తాజా బాధితురాలు పాయల్ రాజ్‌పుత్, తనకు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న బాడీ షేమింగ్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ మధ్యన ఓ ఈవెంట్‌లో పాయల్ రాజ్‌పుత్ సందడి చేసింది. అయితే, అక్కడ ఆ ఈవెంట్ కోసం పాయల్ ధరించిన కాస్ట్యూమ్ అద్భుతంగానే వున్నా, కొన్ని కెమెరా యాంగిల్స్ ఆమెను అసభ్యకరంగా చూపించాయి.

ఆ వీడియోల్ని కొందరు జూమ్ చేసి వైరల్ చేస్తున్నారు.. అసభ్యకరంగా పాయల్ రాజ్‌పుత్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. దాంతో, తన మీద జరుగుతున్న బాడీ షేమింగ్‌పై మండిపడింది పాయల్.

పాయల్ రాజ్‌పుత్‌కి కొత్తేం కాదు..

గతంలో చాలామంది సెలబ్రిటీలకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ లిస్టులోకి పాయల్ తాజాగా చేరిందంతే. ఆ మాటకొస్తే, పాయల్ మీద గతంలో కూడా ఈ తరహా ట్రోలింగ్ జరిగిందనుకోండి.. అది వేరే సంగతి.

మీరు మూసుకుంటే, మేం తెరిచే అవకాశం లేదు కదా.. అని నేరుగా పాయల్ సోషల్ మీడియా హ్యాండిల్‌లోనే ఆమెకి కౌంటర్ ఇస్తున్నారు కొందరు. ఇదో పైశాచికత్వం మళ్ళీ.

అసలు ఏం వీడియో.? ఏం ఫొటో.? అంటూ, పాయల్ రాజ్‌పుత్‌ని నేరుగా కొందరు ప్రశ్నిస్తుండడం ఇంకో విశేషం. ఇదిగో, ఈ వీడియో.. ఈ ఫొటో.. అని, వైరల్ వీడియోల్ని ఫొటోల్ని షేర్ చేస్తున్నారు.

పాయల్ రాజ్‌పుత్ ట్వీటేసినా, సందర్భం ఏంటన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఆమె ట్వీటేశాక, ఇదీ విషయమని నెటిజన్స్ తెలియజేస్తుండడం కొసమెరుపు.

పాయల్ తన ట్వీటులో తన శరీరం, తన సైజ్, తన ప్రైడ్.. అని పేర్కొంది. జుగుప్సాకరంగా తనను చూపించాలనే ప్రయత్నాాలు అభ్యంతకరకరమనీ చెప్పుకొచ్చింది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group