Sai Pallavi Sita Ramayana.. మేకప్ చాలా తక్కువ.. వీలైనంతవరకు సహజంగానే తెరపై కనిపించేందుకు ప్రయత్నిస్తుంది. మంచి నటి, చాలా మంచి డాన్సర్ కూడా.!
సీత పాత్ర కోసం సాయి పల్లవి కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకేముంటుంది.? అంటారు కొందరు. నాన్సెన్స్, సాయి పల్లవిని సీత పాత్రలో ఎలా చూడగలం.? అంటారు మరికొందరు.?
ఓ వైపు ‘రామాయణ’ సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి.. అదే సమయంలో, సాయి పల్లవిపై ట్రోలింగ్ కూడా తీవ్రతరమయ్యింది.
కొన్నాళ్ళ క్రితం ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల అంశమై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్ విషయంలో కూడా ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.
సాయి పల్లవి వ్యాఖ్యల్ని ఖండిస్తూ, ఆమె తీరుని తీవ్రంగా తప్పు పట్టారు చాలామంది నెటిజనం. తానేం తప్పు మాట్లాడలేదంటూ సాయి పల్లవి వివరణ ఇచ్చుకుందనుకోండి.. అది వేరే సంగతి.
Sai Pallavi Sita Ramayan.. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్..
అప్పటి సాయి పల్లవి వ్యాఖ్యలని ఇప్పుడు కొత్తగా వైరల్ చేస్తున్నారు కొందరు. సాయి పల్లవిని దూషిస్తున్నారు కూడా. మార్ఫింగ్ ఫొటోల సంగతి సరే సరి.
అత్యంత భారీ ఖర్చుతో ‘రామాయణ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవితోపాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులూ నటిస్తున్నారు కీలక పాత్రల్లో.
అందంలో సాయి పల్లవి కంటే రకుల ప్రీత్ సింగ్ చాలా బెటర్. కాజల్ అగర్వాల్ ఇంకా ఇంకా బెటర్.. అని చాలామంది అనడంలో వింతేమీ లేదు.
కానీ, నటనా ప్రతిభ విషయంలో వాళ్ళిద్దర్నీ సాయి పల్లవితో పోల్చలేం. బాలీవుడ్ మేకర్స్, కాజల్ అలానే రకుల్‌ని కాదని, సాయి పల్లవికి సీత పాత్ర ఇచ్చారంటేనే, ఆమె ప్రత్యేకత ఏంటనేది అర్థమవుతోంది.
కాజల్ పోషిస్తున్న పాత్ర వేరు, రకుల్‌కి దక్కిన పాత్ర వేరు. అంతకు ముందు వాళ్ళు చేసిన గ్లామరస్ పాత్రల దృష్ట్యా, పవిత్రమైన సీత పాత్రకి సాయి పల్లవే కరెక్ట్.. అన్నది మరికొందరి వాదన.
కారణాలేవైతేనేం, ఈ వివాదాలు పరోక్షంగా సాయి పల్లవికి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడతాయ్.! ఈ ట్రోలింగ్ వల్ల సాయి పల్లవికి వచ్చిన నష్టమేమీ లేదు.
అన్నట్టు, ‘రామాయణ’ సినిమాకి కూడా, ఈ వివాదం కారణంగా ఫ్రీ పబ్లిసిటీ వచ్చిపడుతోంది. ప్రస్తుతానికైతే సాయి పల్లవి ఈ వివాదంపై స్పందించలేదు.
