Rohit Sharma Hitman Lords.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. భారత క్రికెట్ టీమ్‌కి ఎన్నో అద్భుతమైన విజయాల్ని అందించాడు.
మైదానంలో రోహిత్ శర్మ చెలరేగిపోతోంటే, ప్రత్యర్థి టీమ్ బౌలర్లు బెంబేలెత్తిపోతుంటారు.
చాలా అందంగా.. చాలా అంటే చాలా చాలా అందంగా బంతిని స్టేడియంలో క్రికెట్ చూడ్డానికి వచ్చేవాళ్ళ దగ్గరకి తరలిస్తుంటాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.
మెరుపు ఫీల్డింగ్ చేస్తాడు.. అద్భుతమైన కెెప్టెన్సీ కూడా చేశాడు. చెప్పుకుంటూ పోతే చాలానే.! అయినా, ఇప్పుడు రోహిత్ శర్మ గురించి కొత్తగా, గొప్పగా చెప్పేదేముంది.?
రోహిత్ శర్మ అంటేనే హిట్ మ్యాన్.! కానీ, రోహిత్ శర్మ మీద విమర్శలూ అలానే వస్తుంటాయి. బద్దకం ఎక్కువనీ, ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టడనీ, నిర్లక్ష్యంగా ఆడి ఔటయిపోతాడనీ.. అంటుంటారు.
‘ఇక చాలు, రిటైర్మెంట్ తీస్కో..’ అని బోడి సలహాల్ని రోహిత్ శర్మకి చాలామంది ఇచ్చేస్తుంటారు. వాళ్ళందరికీ తన బ్యాట్‌తో సమాధానం చెప్తాడు హిట్ మ్యాన్.
తాజాగా, ఇంకోసారి తన బ్యాటుతో విమర్శకుల నోళ్ళను మూయించేశాడీ స్టార్ క్రికెటర్. అదీ, లార్డ్స్ మైదనంలో సెంచరీ సాధించడం ద్వారా, తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు.
మ్యాచ్ ఓడిపోయాం ఇంగ్లాండ్ చేతిలో.. కానీ, రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ వెరీ వెరీ స్పెషల్. మైదానంలో చాలా ఇబ్బంది పడ్డాడు.. కాలి నొప్పితో విలవిల్లాడాడు.
ఓ దశలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరుగుతాడేమోనని అంతా అనుకున్నారు.. కానీ, కష్టపడ్డాడు.. నిలబడ్డాడు. ఆ కాలి నొప్పి లేకపోతే, ఏమో.. డబుల్ సెంచరీ సాధించేసి, టీమిండియాని గెలిపించేవాడేమో.
ఏదిఏమైనా, రోహిత్ శర్మ లార్డ్స్ వేదికగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. వయసు తననేమీ ఇబ్బంది పెట్టలేదని నిరూపించాడు. ఇంకొంతకాలం క్రికెట్ స్వేచ్ఛగా ఆడగలనని నిరూపించాడు.
అన్నట్టు, లార్డ్స్ మైదానంలో సెంచరీ కొట్టిన ఒకే ఒక్కడు రోహిత్ శర్మ.. టీమిండియా తరఫున.! రోహిత్ సెంచరీ కొడితే, విరాట్ కోహ్లీ ఆనందంతో గంతులేశాడు. దటీజ్ రోహిత్.
మ్యాచ్ ఓడిపోయినా క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మకి జేజేలు పలుకుతున్నారు. లార్డ్స్ మైదానంలో అయితే, ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులూ రోహిత్ శర్మకి స్టాండిగ్ ఒవేషన్ ఇచ్చారు.
