Vaishnavi Chaitanya Epic Moment.. కెరీర్ మొదట్లో ‘నువ్వెవరు.? నీ స్థాయి ఏంటి.?’ అనే ప్రశ్నలు ఎవరిరకైనా తప్పవు.!
మెగాస్టార్ చిరంజీవికే ‘నీ మొహం అద్దంలో చూసుకున్నావా.?’ అని ప్రశ్నించిన సినీ సమాజమిది.!
వైష్ణవి చైతన్య తెలుసు కదా.! బోల్డన్ని యూ ట్యూబ్ వీడియోలతో సోషల్ మీడియా సెన్సేషన్ అనిపించుకుంది. ఆ తర్వాత, సినిమాల్లోకి దూసుకొచ్చింది.
చిన్నా చితకా రోల్స్ నుంచి ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ వరకూ ఎదిగింది వైష్ణవి చైతన్య. ‘బేబీ’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుందీ తెలుగు బ్యూటీ.
అందం, అభినయం.. అన్నీ వున్నా, అదో రకమైన ఆటిట్యూడ్.. అనే విమర్శలున్నాయి వైష్ణవి చైతన్య మీద. ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా ‘ఎపిక్’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తోంది వైష్ణవి.
‘ఎపిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన ఎపిక్ మూమెంట్ గురించి చెబుతూ, ‘ఒకప్పుడు తన గురించి కొందరు తక్కువగా మాట్లాడేవారనీ, ఇప్పుడు తన స్థాయి పెరిగిందనీ.. అదే ఎపిక్ మూమెంట్’ అనీ వివరించింది.
‘నిజమే, అప్పట్లో నా గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ఇప్పుడు పరిస్థితి మారింది. గూగుల్లో వైష్ణవి చైతన్య అని టైప్ చేస్తే, నా ట్రాక్ రికార్డ్ అంతా కనిపిస్తుంది’ అని వైష్ణవి చైతన్య వ్యాఖ్యానించడం గమనార్హం.
వైష్ణవి వ్యాఖ్యలు షరామామూలుగానే కొందరికి నచ్చడంలేదు. ‘అతి’ చేస్తోందనే విమర్శలు ఆమె మీద మళ్ళీ వస్తున్నాయి. ఇందులో ‘అతి’ ఏముంది.? అది, ‘ఆత్మగౌరవం’ అని అంటున్నారు ఇంకొందరు.
ఒక్కటి మాత్రం నిజం.. వైష్ణవి చైతన్య అంటే ప్రస్తుతం ట్రెండింగ్ బ్యూటీ.! ‘ఎపిక్’ సినిమా హిట్టయితే, ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.
‘ఎపిక్’ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బేబీ’ సినిమాలోనూ వైష్ణవి, ఆనంద్ దేవరకొండ జంటగా నటించారు.
