Trolling Against Kayadu Lohar.. కయాదు లోహర్ తెలుసు కదా.? ఇప్పుడు వరుసగా తమిళ సినిమాలు చేస్తోందీ బ్యూటీ.! అప్పుడప్పుడూ తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది.
కన్నడ సినిమాలూ, మలయాళ సినిమాలూ.. వెరసి, అస్సలేమాత్రం తీరిక లేకుండా, వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తూనే వుంది కయాదు లోహార్.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లకు రాలేకపోతోంది. అలా ఓ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనలేకపోవడంతో కయాదు లోహర్ మీద తీవ్రమైన నెగెటివిటీ పుట్టుకొచ్చింది.
తాజాగా, తన మీద జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించిది కయాదు లోహార్. వరుస సినిమా షూటింగుల్లో బిజీగా వుండడం వల్లే, ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొనలేకపోయానని చెప్పింది కయాదు.
Trolling Against Kayadu Lohar.. నా సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడం నాకిష్టం..
‘నేనెప్పుడూ సినిమాల ప్రమోషన్లను ఎంజాయ్ చేస్తాను. మీడియాతో ఇంటరాక్ట్ అవడాన్ని ఇష్టపడతాను. నేను నటించిన సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడమంటే ఇష్టం నాకు..’ అంటూ కయాదు చెప్పుకొచ్చింది.
‘నా గురించి దుష్ప్రచారం చేయడం తగదు. ఓ సినిమా షూటింగ్ అంటే, అది చాలామంది కష్టంతో కూడుకున్న పని. నా వల్ల షూటింగుకి ఇబ్బంది రాకూడదు..’ అంటూ కయాదు వ్యాఖ్యానించింది.

‘సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతే, ముందే నిర్మాతకి సమాచారం ఇస్తాను. వాళ్ళూ అర్థం చేసుకుని నాకు సహకరిస్తున్నారు..’ అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది కయాదు లోహార్.
‘సోషల్ మీడియా ట్రోలింగ్ మీద నాకంటూ ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అలాంటివాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..’ అని కయాదు తేల్చి పారేసింది.
Also Read: సెల్ఫీ ప్రేమ.! అందాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుందా.?
ఏదన్నా సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొనలేకపోతే, అది వ్యక్తిగతంగా తనకు చాలా బాధాకరమైన విషయమట కయాదు లోహార్‌కి.
‘సినిమా ప్రమోషన్ అనేది నటిగా నా బాధ్యత. నా సినిమాల్ని నేను ప్రమోట్ చేసుకోవాలి. సమయం కుదరకపోవడమనేది, రకరకాల కారణాల వల్ల జరుగుతుంది’ అని కయాదు వెల్లడించింది.
తెలుగులో నాని సరసన ‘ది ప్యారడైజ్’ సినిమాలో కయాదు లోహార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
