Yelahanka Palace Jagan Sharmila.. యలహంక ప్యాలెస్ ఎవరిది.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందుతుందా.? వైఎస్ షర్మిల రెడ్డికి దక్కుతుందా.?
చాన్నాళ్ళ క్రితం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ 20 ఎకరాల ప్యాలెస్‌ని బెంగళూరు శివార్లలో కట్టించారని చెబుతుంటారు.
కాదు కాదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘బిజినెస్సులు’ చేసి, సొంతంగా కట్టుకున్నారని ఇంకొందరు అంటుంటారు.
అసలేంటి నిజం.? నిజం చెప్పాలంటే, ఆ నిజం చెప్పాల్సింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి మాత్రమే.! ‘రెడ్డి’ కూడా తగిలిస్తే, వైఎస్ విజయ లక్ష్మీ రెడ్డి అన్నమాట.!
అసలు, మెరుపల్లి షర్మిల కదా.? వైఎస్ షర్మిలా రెడ్డి ఎలా అవుతుంది.? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తుంటాయి.
ఒకప్పుడు.. అంటే, షర్మిల వైసీపీలో వున్నప్పుడు మాత్రం, ‘వైఎస్ షర్మిలా రెడ్డి’ అనే గొప్పగా, గర్వంగా పిలుచుకున్నాయి ఆప్యాయంగా వైసీపీ శ్రేణులు.
అప్పట్లో అంతా బావుంది. ఇప్పుడేమో వ్యవహారం తేడా కొట్టింది మరి.! అందుకే, ఇంటిపేరు మార్చేస్తున్నారు.
అన్నయ్యతో విభేదించి తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు షర్మిల. ఆ కుంపటి మూసేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారామె ఆ తర్వాత.
Yelahanka Palace Jagan Sharmila.. పెళ్ళి గోల.. పంపకాల లీల..
ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తన రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారు వైఎస్ షర్మిల రెడ్డి.
తన కుమార్తె పెళ్ళిని, యలహంక ప్యాలెస్‌లో చేయ తలపెట్టిన షర్మిల, జగన్‌కి ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే.
రాజశేఖర్ రెడ్డి ఏ ఆస్తుల్నీ ఎవరికీ పంచలేదని పేర్కొంటున్న విజయమ్మ, మనవళ్ళందరికీ సమాన వాటాలు తమ ఆస్తిలోంచి దక్కాల్సిందేనని అంటున్నారు.
యలహంక ప్యాలెస్సులో రెండు పెద్ద భవనాలు వున్నాయట. మొత్తం 20 ఎకరాల ప్యాలెస్ అయితే, అందులో చెరో పది ఎకరాల్లో ఒక్కో భవంతినీ నిర్మించారట.
అంత భయమెందుకో.?
ఇదే విషయాన్ని షర్మిలకి రాసిన లేఖలో, జగన్ కూడా పరోక్షంగా ప్రస్తావించారు. వైసీపీ నేత పేర్ని నాని కూడా చూచాయిగా చెప్పారు.. రెండు భవనాల గురించి.
భద్రతా కారణాల్ని వైఎస్ జగన్ ప్రస్తావిస్తూ, షర్మిలకు మొండిచెయ్యి చూపారు.. షర్మిల కుమార్తె పెళ్ళి వేడుకని యలహంక ప్యాలెస్సులో నిర్వహించడానికి వీల్లేదంటూ.
ఈ మొత్తం వ్యవహారం ముదిరి పాకాన పడేసరికి, అసలు ఆ ఇరవై ఎకరాల విలువైన భూమిని వైఎస్ కుటుంబం ఎలా సంపాదించిందన్న చర్చ ఇప్పుడు తెరపైకొస్తోంది.!
‘ఎవడబ్బ సొమ్మనీ..’ అంటూ, సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ప్రశ్నలు దూసుకొస్తున్నాయ్ సాధారణ ప్రజానీకం నుంచి.!
జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలేవైనా స్వచ్ఛందంగా రంగంలోకి దిగి, చిత్తశుద్ధితో నిజాలు నిగ్గు తేల్చితే బావుంటుందేమో.!