Home » ‘నా వైఫ్ మిస్సింగ్’ రివ్యూ: చెత్త మాలోకం.!

‘నా వైఫ్ మిస్సింగ్’ రివ్యూ: చెత్త మాలోకం.!

by Mudra369 Editorial Desk
0 comments
Na Wife Missing Review

Na Wife Missing Review.. అతనో మంచి భర్త.! తన భార్య కనిపించడం లేదని పోలీసుల్ని ఆశ్రయిస్తాడు.

అక్కడో అనుమానపు పక్షి అయిన పోలీస్ అధికారిణి వుంటుంది.! తప్పు భర్తదేనేమోనన్న కోణంలో అనుమానిస్తుంది.

కట్ చేస్తే, హీరోగారి భార్యకి, ఓ లవర్ వుంటాడు.! లవర్‌తో లేచిపోయిందేమోనన్న డౌట్ మనకొస్తుంది.!

పెళ్ళికి ముందే, వేరే వ్యక్తితో తనకు కాబోయే భార్యకి ఎఫైర్ వుందని తెలిసీ, పెద్ద మనసుతో, ఆమెను పెళ్ళాడిన పురుషోత్తముడు మన హీరోగారు.

కట్ చేస్తే, పెళ్ళిని చెడగొట్టడం కోసం అబద్ధమాడింది తప్ప, హీరోయిన్ నిజానికి తప్పు చేయలేదు. కానీ, ఆమెకో లవర్ వుంటాడు.

ఇంతకీ, హీరోయిన్ ఏమైంది.? ఇదీ కథ.! స్వప్న – బాలు ‘కొత్త బంగారు లోకం’ సినిమా కోసం చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

వరుణ్ సందేశ్ ‘బాలు’ పాత్రలో, శ్వేత బసు ప్రసాద్ ‘స్వప్న’ పాత్రలో.. జీవించేశారు. అదొక క్యూట్ లవ్ స్టోరీ.. మంచి మెసేజ్ కూడా ఇస్తారు ఆ సినిమాతో.

ఆ కాంబినేషన్ దాదాపు పద్ధెనిమిదేళ్ళ తర్వాత రిపీట్ అయితే, ఎలా వుండాలి.? అంతే ఫన్ వుండాలి.. కాస్త రొమాంటిక్ టచ్ వుండాలి. రేసీ స్క్రీన్ ప్లే వుండాలి.!

మొదటి నుంచీ, సస్పెన్స్ మోడ్‌లోనే సినిమా నడుస్తుంది. ఓ పిచ్చి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రన్ అవుతుంటుంది. అందరూ ఈజ్ ప్రదర్శించగల నటీనటులే. కానీ, అందరూ బిగుసుకుపోయారు.

చివర్లో, క్షుద్రపూజల సెటప్ ఒకటి.. అదైతే, మరీ ఛండాలం.! చాలా చీప్‌గా కానిచ్చేద్దామనుకున్నారో ఏమోగానీ.. పరమ చిరాగ్గా అనిపిస్తుంటుంది.

నేరుగా ఓటీటీలోకి వదిలారు ‘మై వైఫ్ మిస్సింగ్’ పేరుతో.! ఎంత బాగా తీయాల్సిన సినిమా.? ఎంత చూడచక్కనైన జంటతో ఈ నీరసం సినిమాని తెరకెక్కించారు.?

ఓటీటీలో విడుదల చేసేస్తే, ఎలాగోలా చూసి ఛస్తారు జనం.. అన్నట్టుగా ‘మై వైఫ్ మిస్సింగ్’ సినిమాని తెరకెక్కించినట్లుంది. నిడివి తక్కువే అయినా, మొత్తం చూడాలంటే, నీరసం వచ్చేసింది.

వరుణ్ సందేశ్ కోటాలో ఇంకో డిజాస్టర్ ప్రాజెక్ట్ ఇది.! శ్వేతా బసు ప్రసాద్ అయితే, ఈ మధ్యన తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. మళ్ళీ, ఆమెకు ఇంకో ఛాన్స్ ఈ సినిమా తర్వాత రావడం కష్టమే.!

మిగతా నటీనటుల గురించి మాట్లాడుకోవడం దండగ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కదా.

సినిమాటోగ్రఫీ కూడా అంతే. డైలాగ్స్ సహా.. అంతా హంబక్. నిర్మాణపు విలువల గురించి మాట్లాడుకోవడం అనవసరం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group