Home » అబ్బాయిలా వుండే విష్ణుప్రియ.. అందమైన అమ్మాయిలా.!

అబ్బాయిలా వుండే విష్ణుప్రియ.. అందమైన అమ్మాయిలా.!

by hellomudra
0 comments
Vishnupriya

Vishnupriya Abbayi Ammayi.. విష్ణుప్రియ తెలుసు కదా.? ఆమె ముక్కు మీద బుల్లితెరపై బోల్డంతమంది కమెడియన్లు, యాంకర్లు సెటైర్లేశారు.

ఇక, ‘మగరాయుడు’ అనే కామెంట్ విష్ణు ప్రియ మీదనే కాదు, చాలామంది హీరోయిన్ల మీద రావడం మామూలేననుకోండి.. అది వేరే సంగతి.

బుల్లితెర నుంచి వెండి తెరపైకి ప్రమోట్ అయ్యింది విష్ణుప్రియ తాజాగా. అల్లరి నరేష్, సురభి జంటగా నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో విష్ణుప్రియ కూడా నటించింది.

Vishnupriya
Vishnupriya

సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో పుసుక్కున ‘అబ్బాయిలా వుండే నన్ను అందమైన అమ్మాయిలా చూపించారు..’ అంటూ విష్ణుప్రియ వ్యాఖ్యానించడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.

తన మీద తాను సెటైర్లేసుకోవడం విష్ణుప్రియకి కొత్తేమీ కాదు. కాకపోతే, సినిమాల్లోకి ప్రమోట్ అయ్యింది కదా.. ఒకింత జాగ్రత్తగా వుండాలి. లేదంటే, యవ్వారం తేడా కొట్టేస్తుంది.

అసలే, సినీ ఇండస్ట్రీలో ‘తేడా యవ్వారాలపై’ కుప్పలు తెప్పలుగా గాసిప్పులు పుట్టుకొస్తుంటాయ్.

ఇంకా బుల్లితెర కామెడీ ఐటమ్‌నే.. అని తన గురించి విష్ణుప్రియ అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

Vishnupriya
Vishnupriya

మొత్తమ్మీద, విష్ణుప్రియ ‘అబ్బాయిలా వుండే నేను’ అనే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంబంధిత వీడియో క్లిప్‌కి కుప్పలు తెప్పలుగా వ్యూస్ వస్తున్నాయి.

సెటైర్లు, అసభ్యకర కామెంట్లు.. సర్వ సాధారణమే. ఆల్రెడీ, సినిమాపై ‘వల్గారిటీ’ కోణంలో కొందరు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.

ఈ సమయంలో ‘అబ్బాయిలా వుండే నేను’ అనే కామెంట్ అవసరమా విష్ణుప్రియకి.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group