Nayanthara Hi Movie Stunts.. ‘హాయ్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. అదే సమయంలో ‘టాక్సిక్’ సినిమా కూడా వచ్చింది.! ‘టాక్సిక్’ సినిమా ప్రమోషన్లలో ఎక్కడా కనిపించలేదు నయనతార.
కానీ, ‘హాయ్’ సినిమాకి మాత్రం చాలా చాలా కష్టపడుతోంది ప్రమోషన్ల విషయంలో. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, థియేటర్ విజిట్స్.. వాట్ నాట్.. అన్నీ చేస్తోంది నయనతార.
తెలిసిందే కదా.. నయనతార సినిమాల్ని ప్రమోట్ చేయదని. కాకపోతే, కండిషన్స్ అప్లయ్. తన భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కించే సినిమాలకి మాత్రమే, నయనతార ప్రమోషన్స్ చేస్తుంటుంది.
ఔను, ‘హాయ్’ సినిమా కూడా విఘ్నేష్ శివన్ నిర్మించిందే. కాకపోతే, ఈ సినిమాకి మరో నిర్మాతగా నయనతార కూడా వ్యవహరించింది.
Nayanthara Hi Movie Stunts.. సినిమా ప్రమోషన్లలో.. అన్నీ తానే అయి..
అన్నట్టు, ‘హాయ్’ సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ నయనతార దగ్గరుండి చూసుకుంది. ఓ రకంగా చెప్పాలంటే, నయనతార పూర్తిస్థాయిలో నిర్మాతగా మారి చేసిన సినిమా ఇది.
నటీనటులు తాము నటించిన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడం అనేది, ఆయా నటీనటుల బాధ్యత. రెమ్యునరేషన్‌లో, ఈ ప్రమోషన్స్ అంశం కూడా కలిసే వుంటుంది.
Also Read: దీపిక రెమ్యునరేషన్ గోల.. హీరోల మీద ఏడుపెందుకో.!?
అయితే, నయనతార మాత్రం ఏదన్నా సినిమాకి కమిట్ అయ్యేటప్పుడే, ఆ సినిమాకి ప్రమోషన్స్ చెయ్యనని తెగేసి చెబుతుంటుంది.
అలాగని, నయనతార ఏమన్నా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందా.? అంటే, కళ్ళు చెదిరే ఫిగర్స్ చెబుతుంటుంది రెమ్యునరేషన్ విషయంలో.
ఆమె మార్కెట్ అలాంటిది.. అందుకే, నయనతార ‘ఓకే’ చెబితే చాలు.. అదే మహా ప్రసాదం.. అనుకుంటారు దర్శక నిర్మాతలు.

ఎందుకంటే, నయనతార ఏదన్నా సినిమాలో నటిస్తోందంటే, సినిమా బిజినెస్ పూర్తిగా ఆమె ఇమేజ్ మీదనే జరుగుతుంది మరి.!
ఓ దశలో సినిమా ఖర్చుకి రెట్టింపు.. ఆ పైన రెమ్యునరేషన్ కూడా నయనతారకి ఇచ్చారట తమిళ సినీ పరిశ్రమలో. దటీజ్ నయనతార.!
ఇక, ‘హాయ్’ సినిమా ప్రమోషన్ల కోసం నయనతార కష్టపడుతున్న తీరు చూసి, అంతా ముక్కున వేలేసుకున్నారు. ‘దెబ్బకి దిగొచ్చింది..’ అంటూ నయనతార మీద కొందరు సెటైర్లు వేస్తున్నారు.
మరోపక్క, ‘హాయ్’ సినిమాకి రివ్యూస్ బానే వచ్చాయ్.! కమర్షియల్‌గా సినిమా బాగానే వర్కవుట్ అవుతోంది తమిళనాట. తెలుగులో పెద్దగా వర్కవుట్ కాలేదు.
