Pawan Kalyan Chandrababu Chanakyam.. ‘చంద్రబాబుకి రాజకీయంగా అనుభవం వుంది.. నాకు ఆ అనుభవం లేదు..’ అని జన సేనాని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెబుతుంటారు.
సహజంగానే అది, జన సైనికులకు ఒకింత నచ్చడం లేదు.! కానీ, పవన్ కళ్యాణ్ చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం.! అది, స్థానిక ఎన్నికల్లో ఇంకోసారి నిరూపితమయ్యింది.
కూటమి పంపకాల్లో భాగంగా జన సేన పార్టీకి నాలుగు కార్పొరేషన్లను కేటాయించగా, అది జనసైనికుల్లో తీవ్ర ఆవేదనకు కారణమయ్యింది.
విషయం అక్కడ, నాలుగు సీట్ల గురించి కాదు.. ఆ సీట్లలో ప్రస్తుతం కేవలం రెండు సీట్లలోనే పోటీ చేయగలగుతున్నామనీ.. అందులోనూ, ఒకటి టీడీపీ నుంచి వచ్చిన నాయకుడికి కేటాయించడమే జనసైనికుల ఆవేదనకి కారణం.
Pawan Kalyan Chandrababu Chanakyam.. జనసైనికుల ఆవేదన ఇదీ..
సరే, రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమనుకోండి.. అది వేరే సంగతి. అయితే, చంద్రబాబు చాణక్యం ముందు పవన్ కళ్యాణ్ అమాయకత్వం జనసైనికులకు అస్సలేమాత్రం మింగుడుపడ్డం లేదు.
ఎన్నాళ్ళిలా.? 2014లో పార్టీ పెట్టి, 2026 స్థానిక ఎన్నికల నాటికి కూడా జనసేన బలపడకపోతే ఎలా.? కనీసం, బలపడ్డామని చెప్పుకోలేకపోతే ఎలా.? అన్నది జనసైనికుల సూటి ప్రశ్న.
పుండు మీద కారం చల్లినట్లుగా, ‘టీడీపీ బలమైన రాజకీయ పార్టీ’ అంటూ జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడం, జనసైనికుల్లో మరింతగా ఆగ్రహావేశాలకు కారణమైంది.
ఇంకోపక్క, స్థానిక ఎన్నికల్లో జనసైనికులకు అన్యాయం జరుగుతోంది. తమకు దక్కిన సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమైన జనసేన నేతలకు, నామినేషన్ల తిరస్కరణ అవమానకరంగా మారింది.
నామినేషన్లకు సంబంధించి లీగల్ టీమ్ కీలక పాత్ర పోషిస్తుంటుంది. నామినేషన్ పత్రాల్లో ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగకుండా చూసుకోవాల్సింది న్యాయ నిపుణులే మరి.!
దెబ్బ పడింది..
చిన్న చిన్న పొరపాట్లకే నామినేషన్ల తిరస్కరణ అంటే, అది కుట్రేనన్నది జనసైనికుల అనుమానం. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.!
వైరీ పక్షం వైసీపీతో ఎటూ రాజకీయ పోరాటం తప్పదు. మిత్రపక్షం టీడీపీతో కూడా నిత్య పోరాటమేనా.? అన్న ప్రశ్న జనసైనికుల్ని మరింత ఆవేదనలోకి నెట్టేస్తోంది.
ఇంత జరుగుతున్నా, కార్యకర్తల్ని.. కింది స్థాయి నాయకుల్ని పార్టీ అధిష్టానం సముదాయించలేకపోతోంది. కనీసం, వారి ఆవేదననూ పట్టించుకోవడంలేదు.
ఇంత అమాయకత్వమైతే ఎలా.? ఇప్పుడు ఏమన్నా స్పందిస్తే, పొత్తుకు ఇబ్బంది వస్తుందేమో, ప్రభుత్వానికి సమస్యలేమైనా వస్తాయేమో.. అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తే, అది అమాయకత్వమే కాదు, చేతకానితనం కూడా.