Home » గాయమూ ఒక పబ్లిసిటీ స్టంటేనా.? మేకప్ ట్రిక్ కాదు కదా.?

గాయమూ ఒక పబ్లిసిటీ స్టంటేనా.? మేకప్ ట్రిక్ కాదు కదా.?

by Mudra369 Editorial Desk
0 comments
Zayn Marie Khan

Zayn Marie Khan Cockroach.. ఆమెకు గాయాలయ్యాయి.! అయితేనేం, సోషల్ మీడియా వేదికగా ఆ గాయాల్ని ప్రదర్శనకు పెట్టింది.! ఎందుకు.? ఎందుకేంటి, పాపులారిటీ రావొద్దూ.!

ఎవరామె.? ఇంకెవరు, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మేనకోడలు.! తెలుగులో ‘డెకాయిట్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించింది కదా.? ఆమే, ఈ జేన్ మేరీ ఖాన్.!

అసలేమయ్యింది.? ఢిల్లీ వేదికగా నిరసనలు హోరెత్తుతున్నాయ్.! బొద్దింకల నిరసన నేపథ్యంలో ఇప్పటికే ఓ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు.

అదే జోరులో, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ, బొద్దింకలు ఆందోళనలు చేస్తున్నాయి.

Zayn Marie Khan Cockroach.. అసలీమెకేంటి సంబంధం.?

ఈ ఆందోళనలతో జేన్ మేరీ ఖాన్‌కి ఏం సంబంధం.? అంటే, ఆమె మాత్రమే కాదు.. ఆమె సోదరుడు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నాడు.!

‘జెన్ జీ’ పోరాటం కదా.. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలంటే.! సో, ఆ ‘జెన్ జీ’లో తామూ భాగమని బహుశా ముప్ఫయ్యేళ్ళ జేన్ మేరీ ఖాన్ అనుకుని వుండొచ్చు.

ఆందోళనల్లో పాల్గొంటే, పోలీసుల మీదకు ఎగబడాలని ఎక్కడన్నా రూలుందా.? అంటే, ఇది ‘బొద్దింకల’ రూల్.! పోలీసుల మీదకు బొద్దింకలు ఎగబడుతున్నాయ్.. దారుణంగా దాడులూ చేస్తున్నాయ్ పోలీసుల మీద.

ఆడా మగా అన్న తేడా లేకుండా, మగ పోలీసుల్నీ.. మహిళా పోలీసుల్నీ.. బొద్దింకలు హద్దులు దాటి మరీ, హింసిస్తున్నాయి.

గాయపడ్డ బొద్దింకలు..

పోలీసులు ప్రతిఘటించకుండా వుండరు కదా.! ఈ క్రమంలో కొన్ని బొద్దింకలు గాయపడుతున్నాయి. అలా గాయపడిన బొద్దింకే మన జేన్ మేరీ ఖాన్.!

దెబ్బలు, పోరాటంలో తగిలాయా.? లేదంటే, సినిమాటిక్‌గా దెబ్బలు తగిలించుకుని ఇలా ‘షో’ చేస్తోందా జేన్ మేరీ ఖాన్.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.

ఎందుకంటే, సినీ నటి కదా.. పైగా, ఇదొక పబ్లిసిటీ స్టంట్.! సినిమాటిక్ మేకప్ వాడి, గాయాల్లా అనిపించే, మేకప్ ట్రిక్స్ ప్లే చేస్తోందేమో.? అన్న అనుమానాలూ లేకపోలేదు.

ప్రజాస్వామ్యంలో నిరసన అనేది తప్పు కాదు.! కానీ, ఇదా పద్ధతి.? అన్నదే క్వశ్చన్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group