Operation Sindoor Jai Hind.. పాపిస్తాన్‌తో యుద్ధమనగానే, దేశమంతా ఒక్కటయ్యింది. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు.. మనమంతా భారతీయులమన్నాం.!
దేశమంతా ఒక్కతాటిపైకి వస్తే ఎలా వుంటుందో, ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభమవుతూనే ఇంకోసారి నిరూపించాం భారతీయులమంతా ఒక్కటై.
కానీ, ‘కాల్పుల విరమణ – Cease Fire’ అనగానే, వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చేసింది. అసలెందుకీ కాల్పుల విరమణ.? అన్న విషయమై చర్చించుకునే సమయం కూడా లేకుండా పోయింది.
Operation Sindoor Jai Hind.. కాల్పుల విరమణ ఎందుకు.?
ఔను, భారతదేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు, పాపిస్తాన్ సైన్యంతోపాటు తీవ్రవాదుల దాడి కారణంగా దెబ్బ తిన్నాయి. కొందరు భారత పౌరులూ ప్రాణాలు కోల్పోయారు.
కొందరు భారత సైనికులు, ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. మన తెలుగువాడైన మురళీ నాయక్ అనే జవాను, ఆపరేషన్ సిందూర్‌లో అమరుడయ్యాడు.
అదే సమయంలో, పాకిస్తాన్‌ని కోలుకోలేని దెబ్బ తీయగలిగాం. ఆ దెబ్బ ఏ స్థాయిలో.? అన్నదానిపై మనం చెప్పుకుంటే కాదు, పాకిస్తాన్ ‘కాళ్ళ బేరానికి’ రావడంతోనే సుస్పష్టమయ్యింది.
నిజానికి, కాల్పుల విరమణ కోసం పాపిస్తానే భారతదేశం ముందర మోకరిల్లింది. పాపిస్తాన్‌లోని పలు ఎయిర్ బేస్‌లు దెబ్బతిన్నాయ్.. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కుప్ప కూలింది.
ఆపరేషన్ సింధు.. విజయవంతమే..
లెక్కకు మిక్కిలిగా పాపిస్తాన్ సైన్యం ప్రాణాలు కోల్పోయింది. వందల సంఖ్యలో పాపిస్తాన్ టెర్రరిస్టులూ అంతమయ్యారు. ఇవన్నీ ‘ఆపరేషన్ సిందూర్’ విజయాలే.
ఇంత జరిగాక కూడా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని దక్కించుకోలేకపోయామనే ఆవేదన సగటు భారతీయుడిలో వుండడంలో వింతేమీ లేదు. కానీ, రాత్రికి రాత్రి జరిగిపోయే వ్యవహారం కాదిది.
కీలెరిగి వాత పెట్టాలి.! ‘ఆపరేషన్ సిందూర్’ పూర్తిగా నిలిచిపోలేదు, 48 గంటల పాటు ‘కాల్పుల విరమణ’ మాత్రమే. అసలు కథ చాలా వుంది.!
Also Read: HIT-3 Review: నాని చెప్పింది సగమే నిజం.!
ఈలోగా, రాజకీయంగా విడిపోయి.. దేశ నాయకత్వంపై రాజకీయ విమర్శలు చేయడం సబబు కాదు.! దానికి ఇది సరైన సమయం కాదు.!
మాట్లాడుకుందాం.. అన్నీ చర్చించుకుందాం.! రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అది. మన బాధ్యత కూడా.! కానీ, సరైన సమయం కోసం వేచి చూద్దాం. అప్పటిదాకా, ఒక్కతాటిపైనే వుందాం.
జై హింద్.!