Local Polls Chandrababu Failed CM.. స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అడ్వాంటేజ్.. అనేది రాజకీయాల్లో తరచూ వినే మాటే.
కానీ, సీఎం చంద్రబాబు స్థానిక ఎన్నికలతో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు.
టీడీపీ, జన సేన, బీజేపీ.. ఈ మూడు పార్టీలు కలిసి, కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి, అధికార పీఠమెక్కిన సంగతి తెలిసిందే.
బంపర్ విక్టరీ కొట్టి, ముఖ్యమంత్రి పీఠమెక్కారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగమయ్యింది.
ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్ని కూటమి ప్రభుత్వం అత్యంత సజావుగా నిర్వహించే అవకాశం వుంది. కానీ, స్థానిక ఎన్నికలు రసాభాసగా మారాయి.
ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజల్లో చులకనైపోయారు. కూటమిలో సీట్ల పంపకం వ్యవహారం గందరగోళంగా తయారవడం ఓ యెత్తు.. ఎన్నికల్లో హింస ఇంకో ఎత్తు.
సుప్రీంకోర్టు జోక్యంతో, ఏపీలో స్థానిక ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇది అత్యంత అవమానకరమైన సందర్భం అన్నది నిర్వివాదాంశం.
మరోపక్క, ఈ తాజా పరిస్థిని అడ్వాంటేజ్‌గా మార్చుకుంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ వ్యతిరేకత అంటే, అది తమకు కలిసొచ్చే అంశమన్నది వైసీపీ ఆలోచన. అది నిజం కూడా.
అయితే, ఇక్కడ టీడీపీ మీద వ్యతిరేకత కాస్తా, జనసేన పార్టీకి అడ్వాంటేజ్‌గా మారుతోంది. అందుక్కారణం, కూటమి సీట్ల పంపకాల్లో జన సేన పార్టీకి అన్యాయం జరిగిందన్న కారణంగానే.
ఇది జనసేన శ్రేణుల్లో మాత్రమే వినిపిస్తున్న మాట కాదు.. సాధారణ ప్రజానీకంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. అయితే, టీడీపీతో జనసేన అంటకాగుతుండడం కాస్త ఇబ్బందికరమే జనసేనాని పవన్ కళ్యాణ్‌కి.
ఈ పరిస్థితుల్లో వైసీపీ, జనసేన ఒక్కతాటిపైకి వస్తే.? ఈ చర్చ వైసీపీలో జరుగుతోంది. టీడీపీ కూడా ఇదే విషయమై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకిది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం.
సజావుగా సాగుతున్న పాలన, స్థానిక ఎన్నికల కారణంగా గాడి తప్పడం, కూటమిలో కుంపట్లు.. వీటన్నిటిపైనా డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు చంద్రబాబు ఉపక్రమించాల్సిందే.
‘చంద్రబాబు ఫెయిల్యూర్’ అనే అంశం ఇంతలా హైలైట్ అవడానికి కారణమేంటన్నదానిపై ఆత్మవిమర్శ చేసుకోకపోతే, రాజకీయంగా టీడీపీ అనూహ్యమైన రీతిలో పతనాన్ని చూడాల్సి వస్తుంది.