Home » ‘ఎడ్డి’తనం.! Pawan Kalyan ‘చెప్పు’ ధర ఎంత.?

‘ఎడ్డి’తనం.! Pawan Kalyan ‘చెప్పు’ ధర ఎంత.?

by hellomudra
0 comments
Pawan Kalyan Jana Sena Party

Pawan Kalyan ‘ఏ రాయి అయితేనేం పళ్ళు రాలగొట్టడానికి..’ అన్నది ఓ నానుడి.! బురదలో ముంచిన చెప్పుతో కొడతారా.? పెంటలో ముంచిన చెప్పుతో కొడతారా.? అని ప్రశ్నిస్తే ఎలా వుంటుంది.?

తన మీద వస్తున్న ‘ప్యాకేజీ’ ఆరోపణలపై తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్‌కి. ‘చెప్పుతో కొడతా’ అంటూ చెప్పు చూపించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన మీద ఆరోపణలు చేస్తున్నవారికి.

ఇందులో తప్పేముంది.? నోటికొచ్చింది వాగుతామంటే కుదురుతుందా రాజకీయాల్లో.? విమర్శలకూ ఓ హద్దు వుంటుంది కదా.?

బెంజి కార్లను రాజకీయ అవినీతిలో భాగంగా బహుమతుల రూపంలో పొందేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద ‘బినామీ’ ఆరోపణలు చేయడమే.! ముడ్డి కింద ముప్ఫయ్ మూడు కేసులు పెట్టుకుని కూడా పవన్ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటమే.!

Pawan Kalyan.. వస్తుంది.. కోపం వచ్చి తీరుతుంది.!

అవినీతిలో కూరుకుపోయినవారికి కోపం రాకూడదు. సిగ్గుపడాలి.. సభ్య సమాజం ముందుకు రావాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. కానీ, సిగ్గొదిలేసింది రాజకీయం.!

ఇలాంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు గట్టిగా మాట్లాడితో, సోకాల్డ్ అవినీతిపరులకి కోపం రావడమే కలికాలం.! సరే, రాజకీయాలన్నాక విమర్శలు మామూలేననుకుందాం.

Pawan Kalyan Telugu Media Jana Sena Party
Pawan Kalyan Telugu Media Jana Sena Party

ఆ లెక్కన పవన్ కళ్యాణ్ ‘చెప్పు చూపిస్తే’ అందులో తప్పేముంది.? కుక్కిన పేనుల్లా పడి వుండాలి కదా.? ‘ఇంతకీ ఆ చెప్పు నీదేనా..? చంద్రబాబుదా.?’ అంటాడొకాయన.

చెప్పుతో కొట్టడమనేది ముఖ్యం. మళ్ళీ వీళ్ళకి కొట్టించుకోవడానికి కూడా చంద్రబాబు చెప్పు కావాలట.! ఇలా తయారైంది వ్యవహారం.

గెలిపించిన ప్రజలకు సరైన పరిపాలన అందించమంటే, ‘మమ్మల్ని కొడతానన్న చెప్పుని బురదలో ముంచి కొడతావా.? పెంటలో ముంచి కొడతావా.?’ అని పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తారేంటి.?

దగుల్బాజీ మీడియా..

యజమానిని చెప్పుతో కొడతామని ఎవరన్నా అంటే, కుక్కకి కోపం రావడం సహజమే. అందుకే, ఆ కుక్కలు కూడా మొరుగుతున్నాయ్.

ఇంతకీ, చెప్పుతో కొడతానంటూ పవన్ కళ్యాణ్ చూపించిన ఆ ‘చెప్పు’ ధర ఎంతో తెలుసా.? అంటూ ఆ ధర గురించి రీసెర్చ్ చేసేసి, కథనాన్ని తెరపైకి తెచ్చింది ఓ దగుల్బాజీ మీడియా.

Also Read: Godfather.. చిరంజీవీ.! తెలుగు సినిమాకి నువ్వేమిచ్చావ్.?

కొట్టడానికి ఖరీదైన చెప్పు అవసరమా.? వాడి పడేసిన చెప్పు సరిపోదూ.? ఆ మాత్రం ఇంగితం వీళ్ళకి వుంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు ‘చెప్పుతో కొడతా..’ అని అంటారు.?

పవన్ కళ్యాణ్ అజ్ఞానం కాకపోతే.. చెప్పుతో నిజంగా కొట్టినా మాత్రం.. వీళ్ళకు బుద్ధి వస్తుందా.? ఛాన్సే లేదు.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group