సమీక్ష: ఫహాద్ ఫాజిల్ ‘ధూమం’.! అయ్యేనా జ్ఞానోదయం.?

Dhoomam Fahadh Faasil
Fahadh Faasil Dhoomam Sameeksha.. కొన్ని సినిమాల్ని కేవలం సినిమాల్లా చూడలేం.! ఆ లిస్టులోనే చేరుతుంది ‘ధూమం’.!
కమర్షియల్ ఫార్మాట్‌లో పడి, సభ్య సమాజానికి చక్కటి మెసేజ్ ఇచ్చే సినిమాల్ని మర్చిపోతున్నారు సినీ జనాలు.!
ఏమన్నా అంటే, ఇది కళాత్మక వ్యాపారం.. చేసిన ఖర్చుకి లాభాలు రావాలి కదా.? అని సినీ జనాలు అనడం మామూలే. అందులోనూ నిజం లేకపోలేదు.
సినిమాకి కమర్షియల్ హంగులు అద్దడం వేరు. కేవలం కమర్షియల్ ఆలోచనలతో సినిమాలు చేయడం వేరు. ఔను, సినిమా అంటే కళాత్మక వ్యాపారం. కానీ, అందులో కాస్తయినా నైతికత వుండాలి కదా.!
Fahadh Faasil Dhoomam Sameeksha.. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్..
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. అని సిగరెట్ ప్యాకెట్లపై వుంటుంది. అంత హానికరం అయినప్పుడు, ప్రభుత్వాలెందుకు సిగరెట్ స్మోకింగ్‌ని బ్యాన్ చేయడంలేదు.?
ఎందుకంటే, జనం స్మోకింగ్ చేయాలి.. తద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలి. మద్యం విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.

ప్రభుత్వాల కక్కుర్తి, ప్రజలకు శాపంగా మారుతోంది. అవును, మద్యపానం సంగతి పక్కన పెడితే, ధూమపానం తాలూకు ప్రభావం, ఆ ధూమపానానికి దూరంగా వుండేవారి మీద కూడా వుంటుంది.
మంచి మాటే చెప్పారుగానీ..
ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధూమం’ సినిమాలో, పైన పేర్కొన్న అన్ని విషయాల్నీ ప్రస్తావించారు.
మార్కెటింగ్ స్కిల్స్‌తో మొదలై, మనిషి వినాశనానికి ఎలా దారి తీసిందన్నది ఈ సినిమాలో స్పష్టంగా చూపించడారు. ఒక్కమాటలో చెప్పాలంటే, కళ్ళు తెరిపించారు.
ఇంతకీ, కళ్ళు తెరచుకున్నట్లేనా.? అయితే, ఎవరికి.? ధూమపానం చేసేవాళ్ళకి.. సిగరెట్ కంపెనీలకు సంబంధించి మార్కెటింగ్ సిబ్బందికి.!
‘ఓ చోట గుమికూడిన కొంతమంది జనాన్ని చూసి, వాళ్ళంతా నాకు ఐదు వందలు బాకీ పడి వున్నారు..’ అంటాడో వ్యాపారి. సిగరెట్ కంపెనీ అధినేత అతడు.
మనం ఛస్తే మన వాళ్ళకి నష్టం.. మన వాళ్ళని మనమే చంపుకుంటే.. పొగరాయళ్ళు.. సొంత కుటుంబ సభ్యుల్ని చంపుకునేంత ఘాతుకానికి పాల్పడుతున్నారన్న విషయాన్ని ఇకనైనా తెలుసుకుంటారా.?
Mudra369
టెక్నికల్‌గా సినిమా బావుంది. నటీ నటులు, తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మాటలూ చాలా బావున్నాయ్. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఓ ‘మంచి’ సినిమా చాలా అరుదుగానే కనిపిస్తోంది.
ఓటీటీలో సినిమా అందుబాటులో వుంది గనుక, ఎంచక్కా వీక్షించేయొచ్చు.
ఒక్క సిగరెట్ గురించే కాదు, ఏ ప్రోడక్ట్ విషయంలో అయినా, లబ్దిదారుల్ని ‘బాకీదారులు’గా, బానిసలుగా చూస్తున్న కంపెనీల కుట్ర కోణాల్ని ఇకనైనా ప్రజలు గుర్తిస్తారా.? అంటే, సినిమా చూసి ‘ప్చ్.. ఎంత ఘోరం’ అనుకోవడం తప్ప, చేసేదేమీ వుండదు.
Also Read: లంచం వర్సెస్ లంజం.! ఇందులో తప్పేముంది.?
ఒక్కరంటే ఒక్క స్మోకర్ అయినా, ఈ సినిమా చూశాక స్మోకింగ్ మానేస్తే, ఒక్కరంటే ఒక్క మార్కెటింగ్ పర్సన్ అయినా, తన ఉద్యోగాన్ని వదులుకుంటే.. సినిమా ద్వారా సందేశమివ్వాలన్న ప్రయత్నం సక్సెస్ అయినట్లే.
ఔను, పొగ తాగడం అత్యంత హానికరం. మీకే కాదు, మీ కుటుంబ సభ్యులకీ, మీ సన్నిహితులకీ.!
