Joseph Vijay Ajith Kumar.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.! సినిమా రంగంలో స్టార్ హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కాస్తా, కొంతమంది దురభిమానుల కారణంగా, స్టార్స్ మధ్య ‘వైరం’ పెరుగుతుంటుంది.
‘మా ఇద్దరి మధ్యా ఎలాంటి విభేదాల్లేవు’ అని స్టార్ హీరోలు ఎన్ని సందర్భాల్లో చెప్పినా, అభిమానుల మధ్య ‘శతృత్వం’ మాత్రం అలాగే కొనసాగుతుంటుంది.
పవన్ కళ్యాణ్ జన సేన అధినేతగా, బాలకృష్ణ టీడీపీ నేతగా.. ‘కూటమి’లో వున్నా, ఇరువురి అభిమానుల మధ్య వైరం పెరుగుతూనే వుంటుంది తప్ప తగ్గదు.
తమిళనాడులోనూ ఇంతకు మించిన ‘వైరం’ స్టార్ హీరోల అభిమానుల మధ్య వుంటుంది. మరీ ముఖ్యంగా విజయ్, అజిత్.. ఈ ఇద్దరు హీరోల మధ్యన వైరం అత్యంత జుగుప్సాకరం.
అయితే, ఎప్పుడూ విజయ్‌ని అజిత్ గానీ.. అజయ్‌ని విజయ్ గానీ.. విమర్శించింది లేదు. గత ఎన్నికల సమయంలో విజయ్‌కి పోటీగా అజిత్ రాజకీయాల్లోకి వస్తాడని అంతా అనుకున్నారు.
కానీ, విజయ్ టీవీకే పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేసి, ముఖ్యమంత్రి అయితే.. అజిత్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే వున్నాడు.
అజిత్‌కి మోటార్ రేసింగ్ అంటే ఇష్టం. ఆ మోటార్ రేసింగ్ తమిళనాడులో అభివృద్ధి చెందేందుకోసం ముఖ్యమంత్రి విజయ్ తీసుకుంటున్న చర్యల్ని అజిత్ అభినందిస్తూ లేఖ రాయడం అంతటా చర్చనీయాంశమైంది.
తమిళనాడులో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం దిశగా విజయ్, కీలక ప్రకటనను సీఎం హోదాలో, అసెంబ్లీ సాక్షిగా చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్పోర్ట్స్ సిటీని డిజైన్ చేస్తున్నారు.
ఇలా విజయ్ అసెంబ్లీలో ‘స్పోర్ట్స్ సిటీ’పై ప్రకటన చేశారో లేదో అలా, సీఎం విజయ్‌కి అజిత్ థ్యాంక్స్ చెబుతూ ‘లేఖ’ విడుదల చేశారు.
తమిళనాడు రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు కేరాఫ్ అడ్రస్. వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు తమిళనాడు రాజకీయాలు పెట్టింది పేరు.
అలాంటి తమిళనాడులో సీఎం విజయ్, నటుడు అజిత్ మధ్య ఇంతటి స్నేహపూర్వక అభినందన పూర్వక వాతావరణం.. ఆశ్చర్యకరమే. ఆహ్వానించదగ్గ విషయమే.!
