Neha Sharma Deepfake Warning.. డీప్‌ఫేక్ వీడియోల విషయమై సెలబ్రిటీలు ఒకరొకరుగా హెచ్చరికలు చేస్తున్నారు.. న్యాయ పోరాటాలూ చేస్తున్నారు. కానీ, ‘డీప్‌ఫేక్’ మాత్రం ఆగడంలేదు.!
రకరకాల ట్రెండ్స్ నేపథ్యంలో, సెలబ్రిటీలే మురిసిపోతూ తమ వీడియోల్ని, ఫొటోల్ని.. ఏఐ టూల్స్ ద్వారా తమక్కావాల్సిన విధంగా మార్చుకుంటున్న దరిమిలా, ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు.
ట్రెండ్ ఆగదు గనుక.. వివాదాలూ ఆగవు.! సెలబ్రిటీలు గగ్గోలు పెట్టడమూ మామూలే.! ‘పిల్లి మెడలో గంట కట్టేదెలా.?’ ఇదీ, ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.
తాజాగా, ఈ లిస్టులోకి నటి నేహా శర్మ కూడా చేరిపోయింది. గత కొన్నాళ్ళుగా నేహా శర్మ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా దర్శనమిస్తున్నాయి.
‘చిరుత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహా శర్మ, ఆ తర్వాత వరుణ్ సందేశ్‌తో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా తెలుగు తెరపై కనిపించలేదు ఈ బ్యూటీ.
అన్నట్టు, ఆ మధ్య రాజకీయ తెరపైన కూడా నేహా శర్మ సందడి చేసింది. ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు కావడంతో, ఆయన తరఫున ఎన్నికల ప్రచారంలో హడావిడి చేసింది నేహా శర్మ.
ఇదిలా వుంటే, డీప్ ఫేక్ వీడియోలపై సోషల్ మీడియా వేదికగా అల్టిమేటం జారీ చేసిన నేహా శర్మ, వెంటనే ఆ ఫొటోల్ని తొలగించాలంటూ తెగేసి చెప్పింది.
‘ఇప్పుడు తొలగిస్తే సరే సరి.. లేదంటే, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.. ఎవరూ తప్పించుకోలేరు..’ అంటూ నేహా శర్మ చేసిన హెచ్చరిక వైరల్ అవుతోంది.
వాస్తవానికి, ఇంతకు ముందూ చాలామంది సెలబ్రిటీలు ఇలా హెచ్చరికలు జారీ చేశారు. అయినా, డీప్ ఫేక్ వీడియోలు మాత్రం ఆగడంలేదు.
అన్నట్టు, నేహా శర్మ సోషల్ మీడియా వేదికగా తాను స్వయంగా పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలు.. డీప్‌ఫేక్ కంటెంట్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా వుంటాయని తెలుసు కదా.?!