CJP Delhi Drama NEET.. బొద్దింకలు దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించాయి. కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో అసాంఘీక శక్తులు, భద్రతా సిబ్బందిపై దాడులకు దిగాయి.
రైల్వే స్టేషన్లలోనూ దాడులకు తెగబడ్డారు కాక్రోచ్ జనతా పార్టీ సానుభూతిపరులు. ఇదంతా ఎందుకూ.. అంటే, ‘నీట్’ వివాదం నేపథ్యంలోనేనట.!
వైద్య విద్యకు సంబందించిన ప్రవేశ పరీక్ష ‘నీట్-యూజీ’ పేపర్ లీక్ అవడం, ఇంకోసారి పరీక్షను నిర్వహించడంతో, విద్యార్థులు తీవ్ర అసహనానికి గురైన మాట వాస్తవమే.
కానీ, పార్లమెంటును ముట్టడించేంత స్థాయికి నీట్ విద్యార్థుల్లో అసహనం పెరిగిపోయిందనడం సబబు కాదు. కాక్రోచ్ జనతా పార్టీ, ఈ మొత్తం విధ్వంసానికి పథక రచన చేసింది.
ఇండిపెండెంట్ జర్నలిస్టుల ముసుగులో కొన్ని అసాంఘీక శక్తులు, సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వీడియోల్ని విడుదల చేశాయి. మరోపక్క ప్రకాష్ రాజ్ లాంటోళ్ళూ అగ్నికి ఆజ్యం పోశారు.
వెరసి, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. అసలు ఈ ఆందోళన కార్యక్రమంతో హిజ్రాలకు పనేంటి.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయ్.. ఇంకోపక్క, నిరాహార దీక్షలు.. ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడికిపోవాలన్నది కాక్రోచ్ జనతా పార్టీ వ్యూహం.
కొత్తగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘హైడ్రోజన్ రైలు’ మీద కూడా దాడులకు తెగబడ్డారు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు. ఇది చాలు, వారి ఉద్దేశ్యం ఏంటో చెప్పడానికి.
పోలీసులపై వాహనాలు రువ్వి, పోలీసుల్ని గాయపరిచి, పోలీసుల వాహనాల్ని ధ్వంసం చేసి.. కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.
పోలీసులు ఎంత సంయమనం పాటించినా, రెచ్చగొట్టే చర్యలు మాత్రం ఆపలేదు ‘సీజేపీ’ మద్దతుదారులు.
ఓ వ్యక్తి పోలీసుల దాడుల్లో చనిపోయినట్లు పుకార్లు పుట్టించి, ఓ ఫేక్ వీడియోని ప్రచారంలకి తీసుకొచ్చింది సీజేపీ మూక. దాంతో, పరిస్థితి మరింత అదుపు తప్పింది. చివరికి అది ఫేక్ ప్రచారమేనని తేలింది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ యాగీ చేస్తోంది. మరోపక్క, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ మూకలు నినదిస్తున్నాయి.
