Varanasi Mandakini Priyanka Chopra.. మందాకిని తెలుసు కదా.? అదేనండీ, ‘వారణాసి’ సినిమాలో ప్రియాంక చోప్రా పోషిస్తోన్న పాత్ర పేరు మందాకిని.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఈ ‘వారణాసి’.
‘వారణాసి’ నుంచి గతంలోనే ప్రియాంక చోప్రాకి సంబంధించిన లుక్ రివీల్ చేశారు. చీర కట్టులో ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో ఆమె దర్శనిచ్చింది అప్పట్లో.
ఈసారి పూర్తిగా మోడ్రన్ లుక్‌లో ప్రియాంక చోప్రాని పరిచయం చేసింది ‘వారణాసి’ టీమ్.
తన ఆన్ స్క్రీన్ పార్టనర్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ, ‘వన్ అండ్ ఓన్లీ మందాకిని’ అంటూ సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా ఫొటోలను షేర్ చేశాడు మహేష్‌బాబు.

ఆఫ్రికా అందాలు.. ఆ అందాల్ని తలపించేలా ప్రియాంక చోప్రా అందం.. వెరసి, ఫొటో అదిరిపోయింది. ఇంకో ఫొటోలో ప్రియాంక చోప్రా లుక్స్ నెక్స్‌ట్ లెవల అంటున్నారు నెటిజనం.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ వారణాసి, ఇండియన్ సినిమా స్క్రీన్ మీద, ప్రపంచ సినిమా స్క్రీన్ మీద సృష్టించబోయే సంచలనాలు ఎలా వుంటాయో వేచి చూడాల్సిందే.
అన్నట్టు, చాలా ఏళ్ళ క్రితమే ప్రియాంక చోప్రా ఓ తెలుగు సినిమాలో నటించినా, అది విడుదలకు నోచుకోలేదు. ఆ లెక్కన ‘వారణాసి’ ప్రియాంక చోప్రాకి తొలి తెలుగు సినిమా.
ఇంతకు ముందు, రామ్ చరణ్‌తో ప్రియాంక చోప్రా ‘జంజీర్’ సినిమా చేసింది. అయితే, ‘జంజీర్’ పూర్తిగా హిందీ సినిమా. తెలుగులోకి డబ్ అయ్యిందంతే.
