Pawan Kalyan Mark Politics.. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పాార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
నిన్ననే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పవన్ కళ్యాణ్, హైద్రాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. శస్త్ర చికిత్స విజయవంతమైందని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు.
కాగా, మూడు వారాల తర్వాత ఫిజియోథెరపీ మొదలు కానుంది పవన్ కళ్యాణ్‌కి. పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
నాలుగు నెలల తర్వాత, ఎడమ భుజానికి కూడా శస్త్ర చికిత్స చేస్తారు. ఆ శస్త్ర చికిత్స కూడా ముంబైలోనే జరగనుంది. కొద్ది రోజుల క్రితమే, పవన్ కళ్యాణ్‌కి శ్వాస సంబంధిత శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan Mark Politics.. సర్జరీ ఖర్చులు పూర్తిగా పవన్ కళ్యాణ్‌వే..
గతంలో జరిగిన సర్జరీకి, తాజాగా జరిగిన సర్జరీకి పూర్తిగా తానే ఖర్చులు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రజా ప్రతినిథిగా వున్నారు గనుక, ఆయన వైద్య ఖర్చుల్ని సాధారణంగా ప్రభుత్వమే భరిస్తుంది.
అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో వున్నా, తన ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చుల్ని ప్రభుత్వం నుంచి తీసుకోవడం లేదు.
సినీ నటుడిగా తన పారితోషికం నుంచి ఎక్కువ భాగాన్ని, ప్రజా సంక్షేమం కోసం వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు పవన్ కళ్యాణ్.
ఉప ముఖ్యమంత్రిగా తనకు అందుతోన్న గౌరవ వేతనాన్ని, పిఠాపురం నియోజకవర్గాల్లో అనాధ పిల్లల కోసం పూర్తిగా వెచ్చిస్తుంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ సమ్‌థింగ్ వెరీ స్పెషల్..
మామూలుగా అయితే, తమ ఇళ్ళకు హంగుల్ని సమకూర్చుకోవడానికీ ప్రజా ప్రతినిథులు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో.. పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
రాజకీయాల్లో సరికొత్త మార్పు అంటే ఇదే.! పవన్ కళ్యాణ్, భవిష్యత్ రాజకీయాలకు తనదైన రీతిలో దిశానిర్దేశం చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
ఇదిలా వుంటే, సర్జరీ అనంతరం పూర్తిగా విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేసినప్పటికీ, ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలనే యోచనలో పవన్ కళ్యాణ్ వున్నట్లు తెలుస్తోంది.
