Home » యాప్‌ని నమ్ముకుంటే వైఎస్ జగన్‌కి సీఎం పదవి వచ్చేస్తుందా.?

యాప్‌ని నమ్ముకుంటే వైఎస్ జగన్‌కి సీఎం పదవి వచ్చేస్తుందా.?

by hellomudra
0 comments
Ys Jagan Super App

Ys Jagan Super App.. అసలిప్పుడు రాజకీయాలు ఎలా వున్నాయి.? రాజకీయ పార్టీలు జనంతో కనెక్ట్ అవ్వాలా.? లేదంటే, సోషల్ మీడియా సైన్యంతో, రాజకీయాలు చేసెయ్యగలవా.?

రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావమెంత.? ప్రజలతో కనెక్ట్ అవడానికి రాజకీయ పార్టీలు ఎందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు.?

మరీ ముఖ్యంగా, 2029 ఎన్నికల్లో అధికార పీఠమెక్కాలనుకుంటున్న వైసీపీ, కేవలం వీకెండ్ రాజకీయాలకే ఎందుకు పరిమితమవుతోంది.?

గతంలో కూడా టీడీపీ, జన సేన ఇదే చేసిందా.? అంటే, అప్పటి లెక్కలు వేరు.. ఆ వ్యవహారాలు వేరు. జన సేనాని పవన్ కళ్యాణ్ సినీ నటుడు కూడా. దాంతో, ఆయన వీకెండ్ రాజకీయాలే చేయాల్సి వచ్చింది.

అంతకు ముందు పవన్ కళ్యాణ్ అధికారంలో లేరు కాబట్టి, అది వేరే వ్యవహారం. వైఎస్ జగన్ అలా కాదు. రాష్ట్రానికి మఖ్యమంత్రిగా పని చేశారు ఐదేళ్ళపాటు వైఎస్ జగన్.

Ys Jagan Super App.. ఓటమి నుంచి ఏమీ నేర్చుకోని జగన్..

2024 ఎన్నికల్లో అత్యంత దారుణ పరాజయాన్ని కూడగట్టుకున్న వైసీపీ, ఆ ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు. బెంగళూరుకి పరిమితమైపోయారు వైఎస్ జగన్.

రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పాల్సింది ప్రతిపక్ష నేత హోదా కోరుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డే. అప్పుడే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది.

కానీ, వైఎస్ జగన్ కేవలం వీకెండ్ రాజకీయాలకే పరిమితమవుతున్నారు. ఈ మధ్యనే ఓ యాప్ లాంఛ్ చేశారు వైఎస్ జగన్. జగన్ సూపర్ యాప్ అంట.. అది కూడా, టూ పాయింట్ ఓ.. అంటున్నారు.

సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు పోస్ట్ చేస్తున్న అబ్యూజివ్ కంటెంట్ మీద ఎప్పటికప్పుడు వేటు పడుతోంది. ఈ నేపథ్యంలో, తమ యాప్ తమకెంతగానో ఉపయోగపడుతుందని వైసీపీ అంటోంది.

అబ్యూజివ్ కంటెంట్..

ఇదెక్కడి వితండవాదం.? అబ్యూజివ్ కంటెంట్‌ని జనం మీద రుద్దాలని వైసీపీ చూడటమేంటి.? దాన్ని ప్రభుత్వం అడ్డుకుంటే, తమ యాప్ తమకుందని చెప్పుకోవడమేంటి.?

సూపర్ యాప్ వైసీపీకి ఎంత వరకు ప్రయోజనం.? అది ప్రజలకు కదా, చేరువవ్వాల్సింది.? గతంలో ‘మా ఓటర్లు వేరే వున్నారు’ అని వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలని ప్రస్తావించుకోవాలి.

అధికారం కోల్పోయినప్పటినుంచీ, ‘కళ్ళు మూసుకుంటే ఏళ్ళు గడిచిపోతాయ్..’ అని వైసీపీ శ్రేణుల్ని వైఎస్ జగన్ మభ్యపెడుతూనే వున్నారు. ఎప్పుడూ అదే మాట.

Also Read: నాలుగు పదుల వయసులో.. కుర్చీ మడతబెడితేనే ఫిట్టు.. పెర్‌ఫెక్టు.!

అదే సమయంలో, త్వరలో పాదయాత్ర మొదలవుతుంది.. అని చెబుతున్నారు జగన్. పాదయాత్ర ఈ రోజుల్లో ఎంత దండగమారి వ్యవహారమో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎవరూ చెప్పడం లేదా.?

అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు అందిస్తున్నారోగానీ, అన్నీ డిజాస్టర్ స్క్రిప్టులే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group