Varanasi Rajamouli Love Story.. తాను తీయబోయే సినిమాకి సంబంధించి కథాంశాన్ని ముందే రివీల్ చేసెయ్యడం రాజమౌళి ప్రత్యేకత.! ‘వారణాసి’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది.
ఇంతకు ముందు రాజమౌళి తీసిన సినిమాలతో పోల్చితే, ‘వారణాసి’ కథ రివీల్ అవడం కాస్త లేట్ అయ్యిందంతే. అయినాసరే, సినిమా రిలీజ్ దగ్గర పడే సరికి, పూర్తిగా కథని రివీల్ చేసేసేలా వున్నాడు రాజమౌళి.
తండ్రీ, కొడుకు మధ్య అనుబంధాన్ని వెండితెరపై ‘వారణాసి’తో అద్భుతంగా చూపించబోతున్నాడట రాజమౌళి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.
అంటే, సినిమాలో మహేష్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడా.? అన్న చర్చ జరగడం సహజమే.! మరోపక్క, ‘వారణాసి’ ఓ అందమైన ప్రేమ కథ.. అని రాజమౌళి చెబుతున్నాడు.
ప్రేమ కథ మాత్రమే కాదు, ఆరేడు కథల్ని కలిపినట్లుగా సినిమా వుంటుందని రాజమౌళి చెప్పడం మరో ఆసక్తికరమైన అంశం. ఆ కథల్ని కలపడమే అసలైన సవాల్.. అని కూడా రాజమౌళి చెప్పుకొచ్చాడు.
రామాయణాన్ని వెండితెరపై ఇంతకు ముందెవరూ సరైన విధంగా ఆవిష్కరించలేదని తాను బలంగా నమ్ముతాననీ, అందుకే తాను ఆ బాధ్యతను భుజాన వేసుకున్నాననీ రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.
రాజమౌళి నుంచి వరుసగా వస్తున్న సేట్ట్మెంట్లు.. సినిమాపై అంచనాల్నే కాదు, అనుమానాల్నీ పెంచేస్తున్నాయి. నిజానికి, కాస్త గందరగోళ పరిస్థితి ఇప్పుడు.
మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఓ పది రోజుల షూట్‌తో ‘వారణాసి’ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోతుందిట. అలాగని రాజమౌళి కన్ఫామ్ చేశాడు.
ముందుగా అనుకున్నట్లే, నవంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అత్యంత ఖచ్చితత్వతో జరుగుతాయని దర్శకుడు రాజమౌళి ప్రకటించేయడం ఇంకాస్త ఆసక్తికరం.
మహేష్‌బాబు, ప్రియాంక చోప్రా.. తదితరులు ‘వారణాసి’లో ప్రధాన తారాగణం.!
ఆల్రెడీ ఇంటర్నేషనల్ సినిమా ఆడియన్స్‌ని కూడా తనవైపుకు తిప్పకున్న రాజమౌళి, ఈ ‘వారణాసి’తో ఇంకో మెట్టు పైకెక్కబోతున్నాడు దర్శకుడిగా.
పురాణేతిహాసాల ప్రస్తావన, పౌరాణిక గాధలు, ఫాంటసీ, అడ్వెంచర్స్.. ఇలా ‘వారణాసి’లో చాలా చూడబోతున్నాం.