Home » నిక్కీ తంబోలీ.! ట్రెడిషనల్ టచ్.. ఆపై, ట్రెండీ ఫ్యాషన్ సిగ్నేచర్.!

నిక్కీ తంబోలీ.! ట్రెడిషనల్ టచ్.. ఆపై, ట్రెండీ ఫ్యాషన్ సిగ్నేచర్.!

by Mudra369 Editorial Desk
0 comments
Nikki Tamboli

Nikki Tamboli Glamorous Fashion.. సాంప్రదాయమైన దుస్తుల్ని సైతం తన స్టైల్ గ్లామరస్ లుక్స్‌లోకి మార్చేయడంలో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది హీరోయిన్ నిక్కీ తంబోలీ.!

ఇంతవరకూ గ్లామరస్ రోల్స్‌తోనే వెండితెరపై వెలుగులు విరజిమ్మిన నిక్కీ తంబోలీ ఫ్యాషన్ రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసింది.

లేటెస్ట్‌గా ఫెస్టివల్ వైబ్ క్రియేట్ అయ్యేలా ఓ స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుంది నిక్కీ తంబోలీ. ఓ ట్రెడిషనల్ శారీకి మోడ్రన్ టచ్ ఇచ్చేలా ఈ శారీలో నిక్కీ తంబోలీ లుక్.

మోనో క్రోమటిక్ ఐవరీ (లైట్ క్రీమ్ కలర్) షేడ్‌లో వుంది ఈ శారీ కలర్. ఈ శారీలోని పూసల ఎంబ్రాయిడరీ వర్క్ శారీ మొత్తానికి రిచ్ అండ్ రాయల్ లుక్ ఇస్తోంది.

Nikki Tamboli Glamorous Fashion.. నిక్కీ తంబోలీ గ్లామరూ.. ముత్యాల జాలువారు.!

ఈ శారీకి ప్రధాన ఆకర్షణ ఆమె ధరించిన స్లీవ్‌లెస్ బ్జౌజ్. హెవీలీ ఎంబాల్లిష్డ్. పూసలు, క్రిస్టల్స్‌ మరియు సీక్వెన్స్‌ో డిజైన్ చేయబడి వుంది.

మెడ నుంచి నడుము భాగం వరకూ హ్యాంగిగ్ వైట్ బీడ్స్ ఆమె లుక్‌కి డిఫరెంట్ అందాన్ని తెచ్చిపెట్టాయ్.

శారీ పల్లును ట్రెడిషనల్ వేలో కాకుండా.. భుజంపై నుంచి నీట్‌గా సన్నగా డ్రేప్ చేయడం వల్ల బ్లౌజ్ డిజైన్‌లో వున్న నడుము దగ్గర వున్న హ్యాంగింగ్ ముత్యాలు అందంగా ఎలవేట్ అవుతూ కనిపిస్తున్నాయ్.

Nikki Tamboli
Nikki Tamboli

శారీకి మ్యాచింగ్ కలర్‌లో బ్యాంగిల్స్.. అవి కూడా రెండు చేతులకూ నిండుగా ధరించి టోటల్ అవుట్ ఫిట్‌‌ని వేరే లెవల్ గ్లామర్ టోన్‌కి మార్చేసింది. లూజ్ హెయిర్ స్టైల్.. చెవి కమ్మలను కవర్ చేసేలా వుంది.

అలాగే బ్ౌజ్ హెవీ వర్క్ కావడం నెక్‌ని కవర్ చేయడంతో అదనంగా మెడలో హారాలకు ఛాన్స్ లేదు. నుదుటిగా సింపుల్ పాపిట బిళ్ల ఆమె ముఖ వచ్ఛస్సుకు అదనపు ట్రెడిషనల్ గ్లో అద్దింది.

ఓవరాల్‌గా హై స్టోర్‌డ్ బిల్డింగ్ బ్యాక్ డ్రాప్‌లో ట్రెడిషనల్ అండ్ గ్లామరస్ లుక్స్‌తో నిక్కీ తంబోలీ ఈ లుక్స్ నెట్టింటిని స్పెషల్‌గా షేక్ చేస్తున్నాయని చెప్పడం అతిశయోక్తి అనిపించదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group