Kylie Jenner Diamonds Bra.. చక్కనమ్మ ఏం చేసినా అందమేనంటాడో సినీ కవి.! పేరు తెలుసు కాదా కైలీ జెన్నర్.! గూగుల్ తల్లిని ఇలా అడిగితే, అలా చెప్పేస్తుంది ఈ బ్యూటీ గురించి.!
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ ఫొటోలు వైరల్ అవుతుంటాయ్.! ఈసారి ఈ బ్యూటీ ఎందుకు వైరల్ అయ్యిందో తెలుసా.?
కైలీ జెన్నర్, విక్టోరియా సీక్రెట్ వేదికపై తళుక్కున మెరిసింది. మామూలుగా కాదు, ధగ ధగ లాడే వజ్రాలతో కూడిన ‘కాస్ట్యూమ్’తో రెక్కల గుర్రంలా మెరిసిపోయింది మరి.!
కిందేమో ఓ చిన్న పీసు.. సాధారణమైనదే.! పైన కూడా ఇంకో పీసు.. అది కూడా సాధారణమైనదేనని అనుకునేరు.! ‘ఎఫ్ టీవీ’లో ఇలాంటివి బోల్డన్ని చూస్తుంటాం కాబట్టి, సాధారణం.. అనిపించొచ్చు.
కానీ, ఇది అసాధారణం.! ఏకంగా, దీని ఖరీదు 474 కోట్లు.! దీన్ని తయారు చేయడానికి 15 మంది సుమారు వెయ్యి గంటలు కష్టపడ్డారట.!
Kylie Jenner Diamonds Bra.. వందల కోట్ల ఖరీదైన ‘బ్రా’.!
అంత ప్రత్యేకత ఇందులో ఏముంది.? అది తెలిస్తే, ‘బ్రా’బోయ్ అనాల్సిందే. సాధారణ ‘బ్రా’ ఖరీదు మహా అయితే, ఓ వంద రూపాయలకు అటూ ఇటూగా వుంటుంది.
బ్రాండెడ్ అయితే, ధర వేలల్లోకి వెళ్ళచ్చుగాక.! ఇంకా కొవ్వెక్కితే, లక్షలు వెచ్చించి, ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారేమో.. అదీ, చాలా చాలా అరుదైన విషయం.
మరి, ‘బ్రా’ ఖరీదు కోట్లల్లో వుంటే.? అది కూడా పది కోట్లు కాదు, పాతిక కోట్లు కాదు.. వందల కోట్లైతే, ఖచ్చితంగా ‘బ్రా’బోయ్ అని తీరాల్సిందే.!
ఔను, కైలీ జెన్నర్ ధరించిన ‘బ్రా’ ఖరీదు అక్షరాలా నాలుగు వందల డెబ్భయ్ నాలుగు కోట్ల రూపాయలు.! అంత ప్రత్యేకత ఈ ‘బ్రా’లో ఏముందో తెలుసా.? వజ్రాలు.!
వేలాది వజ్రాలు పొదిగేశారు పొందికగా..
ఔను, వజ్రాలు పొదిగారు ఈ ‘బ్రా’లో.! నాలుగు వేల నాలుగు వందల పది సహజ వజ్రాలు ఈ ‘బ్రా’లో పొదిగారు పదిహేను మంది కళాకారులు.!
ఇంకో పెద్ద ‘యెల్లో డైమండ్’ కూడా వుందండోయ్.! అద్గదీ అసలు సంగతి. వజ్రాలు పొదిగిన బ్రా.. అంటే, ఆ మాత్రం ఖరీదు వుండాలి మరి.!
ఫ్యాషన్ ట్రెండ్స్‌లో భాగంగా ఇలాంటి అద్భుతాల్ని అప్పుడప్పుడూ చూస్తుంటాం. అలాంటి అద్భుతాల్లో ఇంకాస్త ప్రత్యేకమైన అద్భుతం ఇదన్నమాట.!
పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమా కోసం ధరించిన ప్యాటు ఖరీదు లక్షన్నర అంట.. అని అప్పట్లో మాట్లాడుకున్నాం. దీపికా పడుకొనే ఓ సినిమాలో ధరించిన లెహెంగా ఖరీదు ఐదు లక్షలని చెప్పుకున్నాం.
లక్షలేం ఖర్మ.. కోట్లు.. వందల కోట్ల ఖరీదైన ‘బ్రా’ అంటే, ఆషామాషీ వ్యవహారం కాదు. ఫ్యాషన్ యుగంలో.. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు తెరపైకి వస్తూనే వుంటాయ్.