Akkineni Naga Chaitanya Thank You.. అక్కినేని నాగచైతన్య తన తాజా చిత్రం ‘థాంక్యూ’ విడుదల కోసం ఒకింత ప్రత్యేకమైన ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్టున్నాడు.!
ఎందుకిలా.? నాగచైతన్య నటుడిగా పలు సినిమాలు చేశాడు. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి.. కొన్ని ఫెయిల్యూర్స్ కూడా చూశాడు ఈ యంగ్ అక్కినేని.
అయితే, ఎప్పుడూ నాగచైతన్య ఇంతలా ఎమోషనల్ అవలేదు. ఏమయ్యిందోగానీ, తన చిన్నప్పటి ఫొటో.. అదీ అమ్మతో వున్నదీ, నాన్న నాగార్జునతో వున్న మరో ఫొటో పోస్ట్ చేశాడు నాగచైతన్య.
Akkineni Naga Chaitanya Thank You.. అమ్మ, నాన్న.. ఓ శునకం.!
ఇక, మరో స్పెషల్ ఫొటో కూడా విడుదల చేశాడు. ఆ ఫొటోలో నాగచైతన్యతో (Nagachaitanya) వున్నది.. హష్.. అతని పెంపుడు శునకం.!
అమ్మ, నాన్నలతో సమానంగా ఓ పెంపుడు శునకానికి నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ప్రాధాన్యతనివ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

కాగా, ఈ పోస్ట్ చూశాక చాలామంది నెటిజన్లు సమంత (Samantha Prabhu) పేరుని ప్రస్తావిస్తున్నారు.. నాగచైతన్యని సమంత విషయమై ప్రశ్నిస్తున్నారు కూడా.
Also Read: నభా నటేష్ ‘డేటింగ్’ పైత్యం.! ఛీ పాడు యాపారం.!
అక్కినేని నాగచైతన్య అభిమానులు మాత్రం, సమంత (Samantha Ruth Prabhu) ప్రస్తావన వద్దే వద్దంటున్నారు.
సమంత – నాగచైతన్య వైవాహిక బంధం విడాకులతో తెగిపోయినా, సోషల్ మీడియాలో రచ్చ యధాతథంగా కొనసాగుతూనే వుంది.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘థాంక్యూ’ (Thank You Movie) సినిమాలో రాశి ఖన్నా (Raashi Khanna) హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
హీరోయిన్ రాశి ఖన్నా కూడా, నాగచైతన్య తరహాలోనే.. కుటుంబ సభ్యులతో వున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
డౌటానుమానమేంటంటే.. అసలిప్పుడు ’హష్‘ ఎక్కడున్నట్టు.? నాగచైతన్య దగ్గరే వుందంటారా.? ఎందుకంటే అది ఒకప్పుడు నాగచైతన్య, సమంత.. ఇద్దరికీ చాలా చాలా ఇష్టమైన పెంపుడు శునకం.
కొన్నాళ్ళ క్రితం హష్ పుట్టినరోజుని సమంత ప్రత్యేకంగా గుర్తు చేసుకుంది కూడా.. దాంతో తరచూ ఫొటోలకు పోజులిస్తుంటుంది కూడాను.