Prakash Raj Gudi Metlu.. గుడి మెట్లు ఎవరైనా కింద నుంచి పైకి కడుగుతారా.? అని ప్రశ్నించేశాడు ‘పే’కాహం.. అదేనండీ, సినీ నటుడు ప్రకాష్ రాజ్.!
అయినా, గుడి మెట్ల గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడటమేంటి.? ఆయనేమీ హిందువు కాదు కదా.! హిందువుల ఆచారాలు, పద్ధతుల గురించి ప్రశ్నించడానికి ప్రకాష్ రాజ్ ఎవరు.?
జనసేన అధినేత, సినీ నటుడు, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొన్నాళ్ళ క్రితం తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందనే ఆవేదనతో, ఇంద్ర కీలాద్రి మెట్లను శుభ్రం చేశారు.
అదే, ‘పే’కాహం అలియాస్ ప్రకాష్ రాజ్‌కి ఒళ్ళు మండిపోయేలా చేసింది. పవన్ కళ్యాణ్ హిందువు.. ఆయన గుడి మెట్లు శుభ్రం చేస్తే, ప్రకాష్ రాజ్ ఎందుకు ఒళ్ళు మండించుకోవాలి.?
Prakash Raj Gudi Metlu.. ప్రకాష్ రాజ్‌కి ఏంటి సంబంధం.?
గుడి మెట్లు ఎలా శుభ్రం చేయాలన్నదానిపై హిందువులకు కొన్ని పద్ధతులు, అవకాశాలుంటాయ్. శుభ్రం చేయడమంటే, కడగడం కావొచ్చు, తుడవడం కావొచ్చు.
పదో, పాతికో మెట్లు వుండవ్ కదా.. గుడి మెట్లు.. అది కూడా కొండ మీదున్న గుడి మెట్లు.. అంటే, అవి వందల్లో వుంటాయ్. పై నుంచి నీళ్ళు పోస్తేనే కడిగినట్లు కాదు.!
ఓ చెంబుడు నీళ్ళు తీసుకుని, ఓ మెట్టుని శుభ్రం చేసి, పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం కూడా చేస్తుంటారు చాలామంది. కొంతమంది, అన్ని మెట్లకూ ఇలా చేస్తుంటారు. ఎవరి ఓపిక వారిది.
Also Read: Vaibhav Suryavanshi చిన్నోడు.. చిచ్చర పిడుగు! చితక్కొట్టేశాడు!
హిందువు అయి వుంటే, ప్రకాష్ రాజ్‌కి ఇవన్నీ తెలిసి వుండేవి. తెలియనప్పుడు, నవ రంధ్రాలూ మూసుకుని వుండాలి.
అంతేగానీ.. పై నుంచి కడగాలి.. కింద నుంచి కడగాలి.. అని దీర్ఘాలు తీయడమెందుకు.?
చెప్పు దెబ్బలు తినాలంటే, ఏదో ఒకటి వాగాలి. అలాంటి వాగడు వాగడంలో ప్రకాష్ రాజ్ తర్వాతే ఎవరైనా.! ఎవరో ‘పే’ చేస్తారు.. ప్రకాష్ రాజ్, నటిస్తుంటాడు. అదీ అసలు సంగతి. చెప్పు దెబ్బలు ఊరకే రావ్ మరి.!