Shubman Gill GT IPL.. యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్‌గా అతి తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్.!
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటన్స్ జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు ఈ యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటన్స్ అందరి అంచనాల్ని మించి రాణిస్తోన్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చాలా స్ట్రాంగ్‌గా వుంది ‘గిల్’ నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్ జట్టు.
Shubman Gill GT IPL.. అగ్రెసివ్ గిల్..
సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. డెబ్భయ్ ఆరు పరుగులు చేసిన గిల్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు.
నిజానికి, ఈ రనౌట్‌లో శుభ్‌మన్ గిల్ అలసత్వం కూడా వుందనుకోండి.. అది వేరే సంగతి. అదే సమయంలో, థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి గిల్ ఔటయ్యాడు.

అప్పుడే, ఫీల్డ్ అంపైర్ మీద అసహనం వ్యక్తం చేశాడు గిల్. వివాదం ఎలాగో సద్దుమణిగిందనుకునేలోపు, సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ సమయంలో, అంపైర్ తప్పుడు నిర్ణయాల పట్ల గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గిల్ మండిపడ్డాడు.
మైదానంలో గిల్ – అంపైర్ మధ్య తీవ్ర వాగ్యుద్ధమే చోటు చేసుకుంది. ఈ సమయంలో సన్ రైజర్స్ జట్టు బ్యాట్స్‌మెన్ వచ్చి, గిల్‌ని శాంతించాల్సిందిగా కోరడం గమనార్హం.
Also Read: Tuk Tuk Telugu Review: ముగ్గురబ్బాయిలు, ‘ఓ దెయ్యం ప్రేమ కథ’.!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే, బోల్డంత ఎంటర్టైన్మెంట్.. ఇదిగో, ఇలాంటి వివాదాలతోనూ బోల్డంత ఎంటర్టైన్మెంట్ లభిస్తుంటుంది.
కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ తరహా వివాదాలకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వుంటుంది. సాధారణంగా అయితే, శుభ్‌మన్ గిల్ అంత అగ్రెసివ్‌గా వుండడు.
ఇదిలా వుంటే, శుభ్‌మన్ గిల్ ప్రవర్తనపై ఫీల్డ్ అంపైర్లతోపాటు, థర్డ్ అంపైర్ కూడా గుస్సా అయ్యాడని తెలుస్తోంది. మ్యాచ్ ఫీజులో కోత సహా పలు చర్యలు అతని మీద తీసుకునే అవకాశం వుంది.