Nani Hit3 Telugu Review.. నేచురల్ స్టార్ కాస్తా పూర్తిస్థాయిలో వయొలెంట్ స్టార్‌గా మారిపోయి చేసిన సినిమా ‘హిట్-3’. ‘హిట్’ ఫ్రాంఛైజీలో ఇది మూడో మూవీ.!
బాలీవుడ్‌లో వచ్చిన ‘కిల్’, సౌత్‌లో మొన్నీమధ్యనే వచ్చిన ‘మార్కో’.. ఈ చిత్రాల స్థాయిలో రక్తపాతాన్నీ, హింసనీ ‘హిట్-3’ సినిమాలో చూపించబోతున్నారని, ప్రోమోస్‌తోనే అర్థమయిపోయింది.
హీరోయిన్ శ్రీనిధి శెట్టితో నాని రొమాంటిక్ ట్రాక్ ఎలా వుంటుందో.! నాని అంటే, పక్కింటి కుర్రాడు కదా.. మరీ, అంత వయొలెన్స్ వుండదేమో.. ఇలా అనుకుని, థియేటర్లకు ఓ వర్గం ఆడియన్స్ వెళ్ళారు.. ప్రోమోస్ భయపెట్టినా.!
నిజానికి, నాని చాలా జెన్యూన్‌గానే చెప్పేశాడు, చిన్న పిల్లలు ఈ సినిమాకి రావొద్దనీ. హింసని ఇష్టపడనివారు సినిమా వైపు చూడొద్దని కూడా నాని చెప్పడం చూశాం.
Nani Hit3 Telugu Review.. రక్తపాతం.. వాళ్ళంతా షాక్..
అయినాగానీ, పైన చెప్పుకున్న ఓ వర్గం ప్రేక్షకులు సినిమాకి వెళ్ళి షాక్‌కి గురయ్యారు. నాని చెప్పిన మాట విని, సినిమాకి వెళ్ళకుండా వుండాల్సిందన్న భావన వారిలో వ్యక్తమయ్యింది.
మరీ, వయొలెన్స్ అంటే, అంత దారుణంగా వుండదు.. అర్థం చేసుకునేలానే వుంటుంది.. కథలో ప్రేక్షకులు లీనమైపోతారు.. అని నాని చెప్పుకొచ్చాడు ప్రమోషన్లలో.

ఇది మాత్రం, పూర్తిగా నిజం కాదు. నాని తెరపై సృష్టించిన రక్తపాతానికి సరైన జడ్జిమెంటే లేకుండా పోయింది. సినిమాటోగ్రఫీ బావుంది.. స్టైలిష్‌గా కొన్ని సీన్స్ డిజైన్ చేశారు.. ఇవే పాజిటివ్ థింగ్స్.
నాని గురించి కొత్తగా చెప్పేదేముంది.? నాని అంటేనే నేచురల్ స్టార్.. అర్జున్ సర్కార్ పాత్రలోనూ జీవించేశాడు. ఈ విషయంలో నానికి వంక పెట్టడానికేమీ లేదు.
ఛాలెంజ్ ఏదీ ఎక్కడ.?
విలన్ స్ట్రాంగ్‌గా వుండాలి.. అదే ఏ సినిమా సక్సెస్‌కి అయినా కీ-ఫార్ములా. అప్పుడే, హీరో మీద సింపతీ పెరుగుతుంది. అదే సమయంలో, హీరోకి ఛాలెంజెస్ వుండాలి.
అన్నీ, చకచకా తేలిగ్గా హీరో చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా.?
కొన్ని మైనస్సులున్నాయ్.. కొన్ని ప్లస్సులు వున్నాయ్. అలా చూస్తే, ‘హిట్-3’ పూర్తిగా డిజప్పాయింట్ చేసే సినిమా కాదు. కానీ, థియేటర్‌కి అన్ని వర్గాల ప్రేక్సకులూ రావాలి కదా.?

అక్కడే తేడా కొట్టేసింది. పాటలు ఎంగేజింగ్‌గా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వుండాల్సిన స్థాయిలో లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం వేరే లెవల్.
కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయ్.. అదే సమయంలో, కొన్ని బూతులు చికాకు తెప్పిస్తాయ్. ఓవరాల్‌గా నాని ‘హిట్-3’ ఎంపిక చేసుకున్న ఓ వర్గం ఆడియన్స్ కోసం మాత్రమే.
థియేటర్లకు జనం రావడంలేదు మొర్రో.. అని సినీ పరిశ్రమ ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో, కేవలం ఓ సెక్షన్ ఆడియన్స్ కోసమే ఇలాంటి సినిమాలంటే ఎలా.?
Also Read: చిరంజీవి శిఖరం.! ఆయనపై ట్రోలింగ్ చేయడం ఓ రోగం.!
నటుడిగా నాని వివిధ జోనర్స్ ప్రయత్నించడం తప్పు కాకపోవచ్చు. కానీ, ఓ వర్గం ఆడియన్స్‌ని సినిమాకి రావొద్దు.. అనేంత వయొలెన్స్ ఎందుకు.? అన్నదానిపై నాని ఆత్మవిమర్శ చేసుకోవాలి.
క్రైమ్ థ్రిల్లర్స్.. అందులో సైకోపతిక్ క్యారెక్టర్స్.. ఇవన్నీ పరమ బోరింగ్‌గా మారిపోయాయి ఆల్రెడీ. అందుకే, కంటెంట్ థ్రిల్లింగ్‌గా వుండాలి. ‘హిట్-3’ ఆ విషయంలో మంచి మార్కులు వేయించుకోలేకపోయింది.