Ms Dhoni.. క్రికెట్‌లో ఆయన పేరు ధనా ధన్ ధోనీ.! మిస్టర్ కూల్ కెప్టెన్.! జార్ఖండ్ డైనమైట్.! చెప్పుకుంటూ పోతే, ఒక్క పేరు కాదు.. బోల్డన్ని పేర్లున్నాయి టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి.!
ఇకపై ధోనీ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు.! ధోనీ పేరు ముందర, ‘నిర్మాత’ అనే ట్యాగ్ కనిపించనుంది. సినీ నిర్మాతగా మహేంద్ర సింగ్ ధోనీ కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు.
ధోనీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు ధోనీ, తన భార్య సాక్షితో కలిసి. నిర్మాతగా ధోనీ తొలి సినిమాకి ఆయన భార్య సాక్షి కాన్సెప్ట్ ఇస్తుండడం గమనార్హం.
Ms Dhoni.. పేరు ధోనీది.. పర్యవేక్షణ సాక్షిది..
సినీ నిర్మాణ రంగంలోకి రావాలన్న ఆలోచన ధోనీ భార్య సాక్షిది అట.! ఆమెకు క్రియేటివ్ అంశాలపై పట్టు వుందనీ, సినీ నిర్మాణం మీదనే కాదు, సినిమాకి సంబంధించి అన్ని విభాగాలపై ఆసక్తి వున్నాయని తెలుస్తోంది.
ధోనీ బయోగ్రఫీ సినిమాగా వచ్చింది.. అది తెలిసిన విషయమే. ఆ ధోనీ, ఇప్పుడు నిర్మాతగా ఎలాంటి ప్రయాణం చేయబోతున్నాడు.? అన్నదే అభిమానుల్లో ఆసక్తి రేపుతోన్న అంశం.
తనకు బోల్డంత అభిమానాన్ని ఇచ్చిన తమిళనాడుకోసం..
టీమిండియా క్రికెటర్‌గా ధోనీ దేశవ్యాప్త గుర్తింపు, ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. అదంతా ఓ యెత్తు.. తమిళ తంబిలు, ధోనీని ‘ఓన్’ చేసుకోవడం ఇంకో యెత్తు.
Also Read: Nayanthara Vignesh Shivan.! ట్విన్స్, వయా సరోగసీ.!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకి నేతృత్వం వహించడం, బోల్డన్ని విజయాలు అందించడం.. అలా ధోనీ, తమిళనాడు ప్రజలకు దగ్గరయ్యాడు.
ఈ నేపథ్యంలో నిర్మాతగా తన తొలి సినిమాని తమిళంలోనే చేస్తున్నాడు ధోనీ. అయితే, అదెలాగూ పాన్ ఇండియా ప్రాజెక్టు అవుతుందనుకోండి.. అది వేరే సంగతి.