Swathimuthyam Review.. ఈ మధ్య చాలా చెత్త సినిమాలకు విపరీతమైన పబ్లిసిటీ నడుస్తోంది. ‘మా సినిమా హిట్టే.. కాదు సూపర్ హిట్టు..’ అంటూ ప్రచారం చేసుకోవడం చూస్తున్నాం.
విషయం లేని సినిమాల గురించి బహు గొప్పగా మాట్లాడేసుకుంటున్న రోజులివి. కాస్త విషయం వున్నా, కొన్ని కారణాల వల్ల గాల్లో కలిసిపోతున్న సినిమాలూ లేకపోలేదు.
‘స్వాతిముత్యం’ సినిమాలో విషయం వుంది. హీరోయిన్ బాగా చేసింది. హీరో కూడా ఓకే. పైగా, ఓ మంచి పాయింట్ కూడా లేవనెత్తారు.!
Swathimuthyam Review.. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని..
కామెడీ వుంది.. హీరో, హీరోయిన్ల మధ్య యూత్ మెచ్చే లవ్ ట్రాక్ వుంది.. ఫ్యామిలీతో చూసినా ఇబ్బందేమీ లేదన్నంత ఆహ్లాదంగానూ వుంది.
కాకపోతే, సినిమా కాస్త నెమ్మదిగా ‘సాగు’తుంది. అదే పెద్ద కంప్లయింట్. దాన్ని మినహాయిస్తే, ‘స్వాతిముత్యం’ సినిమా బెటర్.!

రెండు పెద్ద సినిమాల మధ్యన ‘స్వాతిముత్యం’ నలిగిపోయింది. ఒకటి ‘ది ఘోస్ట్’ కాగా, ఇంకొకటి ‘గాడ్ ఫాదర్’.
నిజానికి, పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు, చిన్న సినిమాలు అనూహ్యంగా సత్తా చాటడం చూస్తుంటాం. కానీ, ఈ సినిమా విషయంలో పరిస్థితి భిన్నంగా మారింది.
నెల తిరగకుండానే ‘స్వాతిముత్యం’ సినిమా ఓటీటీలో దర్శనమిచ్చేసింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, రిచ్‌నెస్.. ఇలా ఎక్కడా పెద్దగా అభ్యంతరాలేమీ లేవు.
ఆ డొనేషన్.. అదే ముప్పు తెచ్చిందా.?
‘వీర్య’ దానం.. ఆ కాన్సెప్టే, ఫ్యామిలీ ఆడియన్స్‌కి సినిమాని దూరం చేసింది. లేదంటే, ఈ సినిమాలో వున్న ఎంటర్టైన్మెంట్ థియేటర్లకు ప్రేక్షకుల్ని బాగానే రప్పించి వుండేది.
ఎత్తుకున్న కాన్సెప్టుకి యూత్‌ఫుల్ టచ్.. అంటే, నేటి యువతో మెజార్టీ ఆశించే ఆ ‘స్టఫ్’ ఇచ్చి వుంటే, ఫలితం ఇంకోలా వుండేదేమో.!
Also Read: కరణ్ జోహార్‌కి ‘ఆ యావ’ మరీ అంత ఎక్కువా.?
అనగా, లిప్ లాక్ సీన్స్.. కాస్తంత, గ్లామర్.. ఇలాంటివన్నమాట.! సున్నితమైన అంశాన్ని పద్ధతిగా చెప్పాలనుకుంటే పరిస్థితి ఇలానే వుంటుంది.
ఎలాంటి విషయాన్ని అలా చెబితేనే, పనవుతుంది. ఈ లాజిక్కుని దర్శకుడు మిస్సయ్యాడు. అందుకే, ‘స్వాతిముత్యం’ ఎక్కువమందికి చేరువ కాలేయకపోయింది థియేటర్ల ద్వారా.