Ys Sharmila Kalvakuntla Kavitha.. రాజకీయాల్లో మహిళలూ రాణించాలి.! ఇందిరా గాంధీ దేశానికి ప్రధాని అయ్యారు.
జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి.. చెప్పుకుంటూ పోతే రాజకీయాల్ని శాసించిన మహిళామణులు ఎందరో కనిపిస్తారు.
విమర్శలనేవి రాజకీయాల్లో సహజం. అయితే, ఆ విమర్శ ఖచ్చితంగా సద్విమర్శ అయి వుండాలి.
నిజానికి, రాజకీయం అంటే ప్రజా సేవ. రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా ప్రజా ప్రయోజనాలతో ముడిపడి వుండాలి. కానీ, ఇదంతా పాత చింతకాయ పచ్చడి వ్యవహారం.!
తమలపాకుతో నువ్వొకటిస్తే..
మహాత్మా గాంధీ ఏం చెప్పారు.? ఓ చెంప మీద కొడితే, ఇంకో చెంప చూపించమని. అహింసావాదం ఆయనది. కానీ, ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్నది హింసావాదం.
తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నది నేటి రాజకీయం. అంతదాకా ఎక్కడ ఆగుతున్నారు, అవతలి వ్యక్తి ఏమీ అనుకుండానే, ఇట్నుంచి నాలుగైదు చెంపదెబ్బలు వెళ్ళిపోతున్నాయ్.
Ys Sharmila Kalvakuntla Kavitha.. రాజకీయాల్లో రాక్షసత్వం..
మహిళా రాజకీయ నాయకులు తక్కువేం తిన్లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ కుమార్తె ప్రస్తుతం ఎమ్మెల్సీగా వున్నారు. ఆమె ఇటీవల వైఎస్ షర్మిల మీద సెటైర్లేశారు సోషల్ మీడియా వేదికగా.
వైఎస్ షర్మిల తెలంగాణ వేదికగా వైఎస్సార్ తెలంగాణ అనే పార్టీ నడుపుతున్న సంగతి తెలిసిందే. షర్మిల తన పాదయాత్ర సందర్భంగా కేసీయార్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు.
కవిత వర్సెస్ షర్మిల.. బాణమనీ, ఇంకోటనీ.. ఏవేవో సెటైర్లు వేసుకున్నారు. ఎవరికి పనికొస్తాయివి.? జస్ట్ జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయంతే.
Also Read: తమన్నా తకధిమితోం.! ఏమంత వయసైపోయిందని.?
మగాళ్ళెలాగూ నాశనం చేసేశారు.. కనీసం, మహిళా నేతలైనా పద్ధతిగా రాజకీయాలు చేస్తారా.? అంటే, అంతకు మించి.. అనే స్థాయిలో రోజా తదితరులు రాజకీయాల్లో బూతులు వాడేస్తుండడం చూస్తూనే వున్నాం.
మారదు.. ఈ రాజకీయం మారే ప్రసక్తే లేదు. మరింత దిగజారిపోతుందంతే.
అన్నట్టు, కేటీయార్ ఆ మధ్య ‘మై బ్రదర్ వైఎస్ జగన్..’ అంటూ చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడేశారు. అంతకు ముందు తెలంగాణలో నానా రకాల తిట్లూ తిట్టారు.
రాజకీయం అంటే ఇలాగే వుంటుంది. జనాలే వెర్రి వెంగళప్పలు.. గుడ్డిగా రాజకీయ నాయకుల్ని నమ్మేస్తారు.