Veera Simha Reddy.. నందమూరి బాలకృష్ణ గతంలో ‘అఖండ’గా గతంలో అలరించాడు. అంతకు మించి అంటున్నాడీసారి. ‘వీర సింహా రెడ్డ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.!
ప్రతిసారీ అంతకు మించి.. ఇప్పుడు అలానే వుంది సినిమా మీద క్రియేట్ అయిన హైప్. పైగా సంక్రాంతి పండక్కి బాలయ్య సినిమా అంటే, అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంది.?
ప్రీ రిలీజ్ బజ్ అయితే వేరే లెవల్లో వుంది. ఓవర్సీస్లోనూ నందమూరి బాలకృష్ణ రిలీజ్‌కి ముందే మాస్ జాతర సృష్టించేశాడు.
ఇక, థియేటర్లలో బాలయ్య సినిమాకి చేయాల్సిన హంగామా విషయంలో తగ్గేదే లే.. అంటున్నారు నందమూరి అభిమానులు.
Veera Simha Reddy.. మాస్ జాతరకి సిద్ధమేనా.?
బాలయ్య సరసన శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ‘గత రికార్డుల్ని తిరగరాస్తుంది’ అంటూ బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాపై విపరీతమైన కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తూ వచ్చారు.
ఎలా చూసినాగానీ, ఈ సంక్రాంతి పండక్కి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేయనున్నాడన్నది నిర్వివాదాంశం.
‘రాసి పెట్టుకోండి.. హిట్టు కొడుతున్నాం..’ అని బాలయ్య ఘంటాపథంగా చెప్పాడంటే, అది చాలు.. ‘వీర సింహా రెడ్డి’ వసూళ్ళ ప్రభంజనానికి.
Also Read: థాంక్యూ మావయ్యా.! అసలేంటి కథ జూ.ఎన్టీయారూ.!
గోపీచంద్ మలినేని దర్శకత్వం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం.. వెరసి ‘వీర సింహా రెడ్డి’ ఓ పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిందనేది నిర్వివాదాంశం.
శృతిహాసన్ గ్లామర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. గెట్ రెడీ ఫర్ మాస్ జాతర.!