Getup Srinu కమల్ హాసన్ విశ్వనటుడు.. అంతటి కమల్ హాసన్‌తో పోలిక అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాల్లో ఇంకా ఓనమాల దగ్గరే వున్నాడు కమెడియన్ శ్రీను అలియాస్ గెటప్ శీను.
తాజాగా ‘రాజు యాదవ్’ పేరుతో ఓ సినిమా చేశాడీ ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్. గెటప్ శీను తాజా చిత్రం ‘రాజు యాదవ్’ నుంచి టీజర్‌ని విడుదల చేశారు.
గెటప్ శ్రీనుకి కూడా లిప్ లాక్ కావాల్సి వచ్చినట్లుంది. ఇది కూడా కమల్ హాసన్‌తో పోలిక రావడం కోసమేనేమో.!
Mudra369
అంకిత కారత్ ఈ సినిమాలో హీరోయిన్. టీజర్ చూస్తే, సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం. పెద్ద సినిమాల టీజర్లలో పెద్దగా విషయం కనిపించడంలేదు. చిన్న సినిమాల్లోనే కొంత ‘విషయం’ వుంటోంది కూడా.!
Getup Srinu.. బుల్లితెర కమల్ హాసన్.. న్యాయం చేశాడు..
బుల్లితెర కమల్ హాసన్ అనే గుర్తింపుకి న్యాయం చేసినట్లే సినిమాలో అన్ని ఎమోషన్స్ అవలీలగా పండించినట్లున్నాడు గెటప్ శ్రీను.
కాకపోతే, గెటప్ శ్రీనుకి కూడా లిప్ లాక్ కావాల్సి వచ్చినట్లుంది. ఇది కూడా కమల్ హాసన్‌తో పోలిక రావడం కోసమేనేమో.!
జబర్దస్త్ కమెడియన్లలో గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్.. ఈ ముగ్గురూ ఓ టీమ్. ఇందులో హీరోగా సుధీర్ ఓ మోస్తరు విసయాన్ని ఇప్పటికే అందుకున్నాడు.
సో, లిస్టులో ‘బుల్లితెర కమల్ హాసన్’ గెటప్ శ్రీను కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడన్నమాట.
క్రికెట్ ఆడుతుండగా మూతి పగిలితే, అక్కడి నుంచి ఆ మూతి కేవలం నవ్వడానికే పరిమితమైపోతే.. ఇదీ అసలు కథ.!
Also Read: Ravishing రత్తాలు.! సూర్యుడే ముద్దాడితే.!
దీంట్లోంచి బోల్డంత కామెడీ జనరేట్ చేసినట్లే కనిపిస్తోంది. కాస్తంత రొమాన్స్, అవసరమైనంత ఎమోషన్ కూడా కనిపిస్తోంది. గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’గా సక్సెస్ అందుకుంటాడా.? వేచి చూడాలిక.
Getup Srinu, Priyanka Karat, గెటప్ శ్రీను, ప్రియాంక కారత్, రాజు యాదవ్, Raju Yadav,