Roja Slams Balakrishna.. బావ చంద్రబాబు మెప్పు కోసమే బావమరిది బాలయ్య పాకులాడుతున్నారా.? చివరికి తండ్రి స్వర్గీయ ఎన్టీయార్‌ని సైతం అవమానించేలా బాలకృష్ణ వ్యవహరిస్తున్నారా.?
సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా తాజా వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లోనూ, టీడీపీ అభిమానుల్లోనూ తీవ్ర అసహనానికి కారణమవుతున్నాయి.
టీడీపీలో వుండి చంద్రబాబుని పొగిడిన రోజా, వైసీపీలో వుండి టీడీపీని తిడుతున్నారు. తిరిగి టీడీపీలోకి వెళ్ళాల్సిన అవసరమొస్తే, అప్పుడు మళ్ళీ చంద్రబాబు భజన తప్పదు.! రాజకీయమంటే ఇంతే.!
Mudra369
రాష్ట్రంలో ఎమర్జన్సీ పరిస్థితులు వున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రోజా తీవ్రంగా స్పందించారు.
Roja Slams Balakrishna.. ఎమర్జన్సీ టీడీపీ హయాంలోనే
తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎమర్జన్సీ తరహా పరిస్థితులు వుండేవనీ, బావ మెప్పు కోసం అప్పుడు మాట్లాడని బాలకృష్ణ, ఇప్పుడు వైఎస్ జగన్ సర్కారుపై అదే బావ మెప్పు కోసం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘నన్ను రాజకీయంగా చంపెయ్యడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు..’ అని స్వయంగా ఎన్టీయార్ కన్నీరుమున్నీరైతే, ‘అదేమీ తప్పు కాదు..’ అని ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ద్వారా బాలయ్య కవరింగ్ ఇచ్చారన్నది రోజా ఆరోపణ.

‘చంద్రబాబు కొడుకు లోకేష్‌కి తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేసిన బాలకృష్ణ.. కూతురు బాగు కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు..’ అంటూ రోజా వ్యాఖ్యానించడం ఒకింత చిత్రంగానే వుంది.
లోకేష్.. స్వయానా బాలకృష్ణకి మేనల్లుడే కదా.! అలా చూసినా బాలయ్య, చేస్తున్నదాంట్లో తప్పేముందబ్బా.? అదంతా ఒకటే కుటుంబం కదా.!
అన్‌స్టాపబుల్‌కి పిలిచినా వెళ్ళను..
‘నేను అన్‌స్టాపబుల్ షోకి వెళ్ళను..’ అని తేల్చేశారు రోజా. ‘జగన్‌గారికి ఎవరైనా చాడీలు చెబుతారేమో.. అప్పుడు నన్ను అపార్థం చేసుకుంటారేమో జగన్ గారు.. అందుకే వెళ్ళను..’ అని గతంలో చెప్పారు రోజా.
తాజాగా మాట్లాడుతూ, ‘అన్‌స్టాపబుల్‌ని రాజకీయ వేదికగా చేసేశారనీ.. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్.. అందుకే నేను అక్కడికి వెళ్ళను’ అని రోజా చెప్పడం గమనార్హం.
Also Read: ‘వీర సింహా రెడ్డి’ రాజకీయం.! బాలకృష్ణ ‘ఎమర్జన్సీ ఎటాక్.!
మొత్తమ్మీద, టీడీపీలో వుండి చంద్రబాబుని పొగిడిన రోజా, వైసీపీలో వుండి టీడీపీని తిడుతున్నారు. తిరిగి టీడీపీలోకి వెళ్ళాల్సిన అవసరమొస్తే, అప్పుడు మళ్ళీ చంద్రబాబు భజన తప్పదు.! రాజకీయమంటే ఇంతే.!