Table of Contents
Ramcharan NTR For Oscars.. తెలుగు సినిమాకి ఆస్కార్ వేదికపై అత్యద్భుతమైన గౌరవం దక్కాలని తెలుగు నేల ఎదురుచూస్తోంది. ఇండియన్ సినిమా కూడా ఇదే ఆలోచనతో వుంది.!
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమా ఆస్కార్ రేసులోకి దిగిన దరిమిలా, నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది సగటు సినీ అభిమానిలో.
దేశం తరఫున అధికారిక ఎంట్రీ ఆస్కార్ రేసులోకి దొరక్కపోయినా, ‘ఆర్ఆర్ఆర్’ వేరే మార్గంలో, ఆస్కార్ బరిలలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
ఎన్టీయార్.. ముందంజలో..
నటుడిగా యంగ్ టైగర్ ఎన్టీయార్ ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకుంటాడా.? ఎన్టీయార్ ఫర్ ఆస్కార్స్.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీయార్ ప్రదర్శించిన నటనకు ఫిదా అవనివారుండరు. అత్యద్భుత నటనతో మెప్పించాడు. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.
జూనియర్ ఎన్టీయార్ (Young Tiger NTR) యాక్షన్ ఎపిసోడ్స్‌లో రాణించాడు, ఎమోషన్స్ పండించాడు.. డాన్సుల్లో సత్తా చాటాడు. ఇంతకన్నా ఏం కావాలి.?
రామ్ చరణ్ తక్కువేమీ కాదు..
నిజానికి, అంతకు ముందు వరకూ చరణ్‌తో పోల్చితే, ఎన్టీయార్ గొప్ప నటుడు. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎవరు తక్కువ.? ఎవరు ఎక్కువ.? అన్నది తూకం వెయ్యలేం.

ఎన్టీయార్‌ని మించి చరణ్.. చరణ్‌ని మించి ఎన్టీయార్.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. నిజానికి, ఎన్టీయార్ కంటే, భిన్నమైన షేడ్స్ రామ్ చరణ్ పాత్రలో వున్నాయి.
ఆస్కార్ రేసులో చూసేది, ఈ భిన్నమైన షేడ్స్ గురించే. సో, చరణ్‌కి (Mega Power Star Ram Charan) కూడా అడ్వాంటేజ్ లేకపోలేదు.
Ramcharan NTR For Oscars.. ఆస్కార్ వర్సెస్ భాస్కార్..
భాస్కార్ పురస్కారాలంటే వెటకారం.! ఔను, ఆ వెంటకారాన్ని ఇరువురు హీరోల మీదా హేటర్స్ అప్లయ్ చేస్తున్నారు. ఇదొక దురదృష్టకరమైన వాతావరణం.
Also Read: వీర సింహా రెడ్డి: బాలయ్య చెప్పిన ‘చుట్ట’ కథ.!
ఇటు చరణ్ అభిమానులు, అటు ఎన్టీయార్ అభిమానులు.. తమ తమ అభిమాన నటులకు కలిసి సపోర్ట్ చేస్తే.. మరింత ఆరోగ్యకరమైన వాతావరణం వుంటుంది.
హీరోలు కలిశారు.. స్నేహంగా వుంటున్నారు. అభిమానులకేంటీ రోగం.?