Nidhhi Agerwal Love.. ‘సవ్యసాచి’, ‘మజ్ఞు’ సినిమాలతో ఫ్లాపులు చవిచూసినా.. తెలుగు ప్రేక్షకుల్ని ఒకింత స్పెషల్‌గానే పలకరించింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. మరీ ముఖ్యంగా తన క్యూట్ అప్పీల్‌తో కుర్రకారును పడగొట్టేసింది.
కానీ, సక్సెస్ రాకపోవడంతో స్టార్‌డమ్ రేస్‌లో వెనకబడిపోయింది. బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మెగా కాంపౌండ్‌ని టచ్ చేసింది.
తాగే నీరు, పీల్చే గాలి.. అన్నీ కల్తీనే.!
మరి, స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది.?
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మాత్రం స్వచ్ఛమైన ప్రేమ కోరుకుంటోంది.! సాధ్యమేనా.?
Mudra369
‘హరి హరవీరమల్లు’ (Hari Hara Veera Mallu) కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో (Power Star Pawan Kalyan) జత కడుతోంది. పీరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా వుండబోతోంది.
Nidhhi Agerwal Love.. నిధి అగర్వాల్ క్రష్ ఎవరితోనో తెలుసా.?
అది సరే కానీ.. తాజాగా నిధి అగర్వాల్‌ని ప్రేమ గురించి అడిగితే, కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. స్కూల్ డేస్‌లో టీచర్‌తో లవ్‌లో పడిందట అందాల నిధి.

కానీ, అది జస్ట్ ఎట్రాక్షన్ అని తర్వాత తెలుసుకుందట. అన్నట్లు టీనేజ్‌లో వున్నప్పుడు ఒకసారి నిధి అగర్వాల్ లవ్‌లో పడిందట. అది నిజమైన లవ్వే కానీ, బ్రేకప్ అయ్యిందనీ చెబుతోంది.
ప్రస్తుతం ఎవరితోనూ తాను ప్రేమలో లేనని చెబుతోంది. తనను ఇంప్రెస్ చేయగల స్వచ్ఛమైన ప్రేమ దొరికితే ఖచ్చితంగా లవ్ చేస్తానని చెబుతోంది నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).
Also Read: 5 ఇళ్ళు.! అవి సొంతమైతే ఆ కిక్కే వేరప్పా: రష్మిక
బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కి వచ్చిన ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్ హీరోల్లో ఎవరంటే ఇష్టమని అడిగితే, బాద్‌షా షారూఖ్ పేరు చెబుతోంది.
టాలీవుడ్‌లో రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అంటే తనకెంతో ఇష్టమని చెబుతోంది.
ఆల్రెడీ మెగా కాంపౌండ్‌లోనే వుంది కదా.. ఏమో.! భవిష్యత్తులో చరణ్‌తోనూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి మరి.