Andhra Pradesh Sticker Politics.. లబ్దిదారులకెందుకు.? ఏకంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ‘పచ్చబొట్లు’ పొడిపించేసుకుంటే.? వినడానికి కాస్త వెరైటీగా వుంది కదా ఈ కాన్సెప్ట్.!
ఒకాయన తాను చచ్చిపోయాక కూడా ఫలానా పార్టీ జెండానే తన పార్దీవ దేహం మీద వుండాలన్నాడు. అలా కథలు చెప్పిన ఆ ‘నాయకుడు’గారు, ఆ తర్వాత పలు పార్టీలు మారారు.
రాజకీయాలంటే ఇలా తగలడతాయ్.! నాయకులు ‘కప్పల తక్కెడ’ తరహాలో పార్టీలు మార్చేస్తుంటారు. అనుచరులు వెర్రి వెంగళప్పలు కదా.. తమ నాయకుల కోసం కొందరైతే పచ్చబొట్లు పొడిపించేసుకుంటుంటారు.
Andhra Pradesh Sticker Politics.. అసలు ఈ పచ్చబొట్టు గోలేంటి.?
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ, ఇంటింటికీ ఓ స్టిక్కర్ అంటించాలనే ప్లాన్లో వుంది. పార్టీ పరమైన ఆలోచనా.? ప్రభుత్వ పరమైన ఆలోచనా.? అన్నది ముందు ముందు తేలుతుంది.
ఔను కదా.! ప్రజా ధనాన్ని వేతనాలుగా పొందుతున్న పాలకులు.. ఆ ప్రజా ధనాన్ని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పంచుతూ.. తమ సొంత పబ్లిసిటీ చేసుకోవడమేంటి.? సొమ్ములేమో జనాలవి.. ప్రచారమేమో పాలకులది.! స్టిక్కర్లెందుకు.? పచ్చబొట్లు గురించి సోచాయిస్తేనో.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి.?
Mudra369
ఇక, ఈ స్టిక్కర్ రాజకీయంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Janasena Leader Nadendla Manohar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాదు కాదు, సెటైర్లేశారు.
‘బహుశా మీకు మీ మీద మీ అధినాయకత్వానికి అనుమానాలున్నట్టున్నాయ్.. మీరైతే ముందు పచ్చబొట్లు పొడిపించుకోండి..’ అంటూ నాదెండ్ల మనోహర్ సెటైరేయడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది.

రచ్చ బండ వేదికలపైనా జనం ఇదే అంశంపై చర్చించుకోవడంలో వింతేముంది.? ప్రజాస్వామ్యం అంటే ప్రజలతోనే కదా.! ఆ ప్రజల్ని వెర్రి వెంగళప్పలుగా చూసే రాజకీయాన్ని ఏమనాలి.?
సొమ్ములెవడివి.? సోకులెవడివి.?
జనసేన మహిళా నేత రాయపాటి అరుణ ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘జనం సొమ్ముతో పరిపాలన చేసే రాజకీయ నాయకులు.. తాము అధికారంలో వున్నప్పుడు ప్రజా ధనంపై సొంత ప్రచారం చేసుకుంటున్నారు’ అని ఆరోపించారు.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
ఇందులో వింతేముంది.? ఎవరు అధికారంలో వున్నా చేసేది అదే.! జనం మదిలో, ‘ప్రభుత్వ ఖజానా అంటే ప్రజాధనం’ అన్న విజ్ఞత వచ్చేదాకా ఇలాగే వుంటుంది వ్యవహారం.!