Ram Gopal Varma Dog.. అదిరిందయ్యా ఆర్జీవీ.! ఔను, ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మని అభినందించాల్సిందే.!
విశ్వనగరం హైద్రాబాద్‌లో ఓ చిన్నారి, వీధి కుక్కల ‘వేట’కు బలైపోవడం అత్యంత బాధాకరం. ఈ విషయమై సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
ఇంత అద్భుతమైన అవకాశం వస్తే, ఆర్జీవీ ఊరుకుంటాడా.? ట్వీట్ల మీద ట్వీట్లేస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఆర్జీవీ.
పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా.!
ఏమో, వర్మ ఈ ‘కుక్క’ ఘటన నేపథ్యంలో సినిమాని అనౌన్స్ చేసేస్తాడేమో.!
సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడితే, ప్రపంచం మారిపోతుందా.?
ఆర్జీవీ రూటే సెపరేట్లు.! పబ్లిసిటీ వస్తుందనుకుంటే.. ఎంతదాకా అయినా వెళ్ళిపోతాడంతే.!
Mudra369
ఆర్జీవీ అంటేనే పబ్లిసిటీ.. పబ్లిసిటీ అంటేనే ఆర్జీవీ.! అందుకే, అందివచ్చిన అవకాశాన్ని అత్యద్భుతంగా సద్వినియోగం చేసేసుకుంటున్నాడు.
Ram Gopal Varma Dog ఎంతటి బాధ్యత.!
‘భంచిక్’ సినిమాలు తీసే ఆర్జీవీకి, సమాజం పట్ల ఇంత బాధ్యతా.? అసలు దానికీ, దీనీకి ఏం సంబంధం.? సినిమా వేరు, సమాజం పట్ల బాధ్యత వేరు.!
సినిమాల్లో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించే ఆర్జీవీ, సమాజం పట్ల మాత్రం ఇదిగో.. ఇలా సోషల్ మీడియా వేదికగా బాధ్యత ప్రదర్శిస్తే.. ఒకింత డౌటానుమానం రాకుండా వుండదు.!
అయినా, వీధి కుక్కల మీద అంత శ్రద్ధ ఆర్జీవీకి ఎందుకొచ్చిందట.? సమాజంలో అవినీతి, హత్యలు.. అత్యాచారాలు.. వీటి మీద ఆర్జీవీ ఎందుకు స్పందించడు.?
అంతా ఆయనిష్టం.!
ఏ విషయమ్మీద స్పందించాలో, ఏ విషయమ్మీద స్పందించకూడదో అది ఆర్జీవీ ఇష్టం.! అద్గదీ సంగతి. అలాగనేస్తే.. ఇక, ఏ సమస్యా వుండదు.
Also Read: ఫాఫం పవర్ స్టార్ కిరణ్ అబ్బవరం! ఇలా ఇరికించేసిందెవరంటే.!
ఒక్కటైతే నిజం.. వీధి కుక్కలు ఓ చిన్నారిని బలి తీసుకోవడం క్షమించరాని విషయం. కానీ, తప్పెవరిది.? ఆ కుక్కలదా.? వాటిని అలా నిర్లక్ష్యంగా రోడ్ల మీద తిరగనిస్తున్నవారిదా.?
అన్నట్టు, ఆర్జీవీని కూడా సమాజాన్ని కరిచేసే ‘ఊర కుక్క.. పిచ్చి కుక్క..’ అని కొందరు ఆరోపిస్తున్నారు. ఆర్జీవీకి, ఇలాంటి విమర్శలు కొత్తేమీ కాదనుకోండి.. అది వేరే సంగతి.