Rajamouli Naatu Naatu Oscars రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ డాన్సులు అదరగొట్టేశారు. కీరవాణి మ్యూజిక్ కెవ్వు కేక. ప్రేమ్ రక్షిత్ డాన్స్ మూమెంట్స్ వేరే లెవల్.! రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవ వాయిస్ సూపర్బ్.!
ఇవన్నీ ఓ యెత్తు.. దర్శకుడు రాజమౌళి విజన్ ఇంకో యెత్తు.! నిజానికి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ కోసం టీమ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
వందల మంది డాన్సర్లు.. అత్యద్భుతమైన సినిమాటోగ్రఫీ.. వాట్ నాట్.. అన్నీ ప్రత్యేకమే.!
విజనరీ రాజమౌళి.! నేరుగా ఆస్కార్‌నే కొల్లగొట్టేశాడు.!
ఈ క్రమంలో రాజమౌళి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.!
నాటు నాటు.. వన్ అండ్ ఓన్లీ రాజమౌళి నాటు నాటు.. అంటే అతిశయోక్తి ఏముంది.?
Mudra369
స్టైలింగ్ దగ్గర్నుంచి.. ప్రతీదీ చాలా చాలా ప్రత్యేకం. ఇవన్నీ ఓ యెత్తు.. రాజమౌళి కష్టం ఇంకో యెత్తు.! ఇద్దరు సూపర్బ్ డాన్సర్లు అలా రెచ్చిపోతోంటే, అందులోంచి ‘బెస్ట్’ ఎంపిక చేయడం.. ఆషామాషీ వ్యవహారం కాదు.
Rajamouli Naatu Naatu Oscars.. ఆస్కార్ వేదిక వరకూ..
సినిమా తీశాం.. హిట్టు కొట్టేశాం.. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని ‘ఆర్ఆర్ఆర్’ మేనియాలో ముంచేశాడు రాజమౌళి.

రాజమౌళి అండ్ టీమ్.. ప్రపంచంలోని వివిధ దేశాల్ని సందర్శించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రమోట్ చేసింది. అంతర్జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది.
హాలీవుడ్ ఫిలిం మేకర్స్‌తో చర్చోపచర్చల దగ్గర్నుంచి… ఆయా అవార్డుల రేసులో ‘ఆర్ఆర్ఆర్’ వుండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు.. అన్నీ తానే అయి వ్యవహరించాడు రాజమౌళి.
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ నామినేషన్స్‌లోకి వెళ్ళడానికే చాలా కథ నడిచింది. చివరికి రాజమౌళి సాధించాడు. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ పురస్కారం లభించింది.
Also Read: Pavitra Naresh Wedding: మీరు మామూలోళ్ళు కాదు సుమీ.!
గ్లోబల్ స్టార్ రామ చరణ్.. ఎన్టీయార్ గోస్ గ్లోబల్.. ఇవన్నీ ఓ యెత్తు.. ఇంటర్నేషనల్ విజనరరీ ఫిలిం మేకర్ రాజమౌళి.. ఇది ఇంకో యెత్తు.!