Mudra369 Ugadi Sobhakankshalu.. హ్యాపీ న్యూ ఇయర్.. అని చెప్పుకోవడానికీ.. ‘ఉగాది శుభాకాంక్షలు’ అని చెప్పుకోవడానికీ ఎంత తేడా.?
తప్ప తాగి చిందులేస్తే అది ‘హ్యాపీ న్యూ ఇయర్’.! కానీ, పద్ధతిగా ఇంట్లో దేవుడికి పూజ చేసి.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికితే, అది ‘ఉగాది’ వేడుక.!
అదీ కొత్త సంవత్సరమే.. ఇదీ కొత్త సంవత్సరమే.! ఆ ఇంగ్లీషు సంవత్సరానికి ‘సంఖ్య’ తప్ప పేరు లేదు. ఈ తెలుగు సంవత్సరానికి మాత్రం సంఖ్య, పేరుతోపాటు.. చాలా ప్రత్యేకతలుంటాయ్.!
Mudra369 Ugadi Sobhakankshalu.. శోభకృత నామ సంవత్సరం..
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో ‘ఉగాది పచ్చడి’ అనేది తప్పనిసరి. షడ్రుచులు ఇందులో కలిసి వుంటాయ్.
ఉప్పు, కారం, పులపు, తీపి, చేదు, వగరు.. ఇవన్నీ కలిస్తేనే జీవితం.! ఔను, మధురమైన జ్ఞాపకాలుండాలి.. చేదు అనుభవాలూ తప్పనిసరి. ఇలా ఏ రుచి ప్రత్యేకత ఆ రుచిదే.!
కారం.. మమకారం.. పుల్లటి అనుభూతి.. అన్నీ కలిస్తేనే మనిషి జీవితం కదా.!
పంచాంగ శ్రవణం..
ఏ రాశి వారికి కొత్త సంవత్సరం ఎలా వుంటుందని మాత్రమే కాదు, ఎలా జీవించాలో కూడా చెప్పేదే పంచాంగం. రాను రాను పంచాంగంలో రాజకీయ పైత్యం పెరిగిపోయింది.
రాజకీయ పార్టీలకు అనుగుణంగా పంచాంగాలు ఎలా మారిపోతున్నాయో, వ్యక్తులకు అనుగుణంగా కూడా పంచాంగాలు మారిపోతున్నాయి.
Also Read: ‘చిత్రం’ చెప్పే కథ.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!
అలాంటి ‘చేదు వ్యవహారాల్ని’ పక్కన పెట్టేసి, కొత్త సంవత్సరం.. అందరికీ అంతా మంచే జరగాలని ఆశిద్దాం.!
నిర్దేశించిన లక్ష్యాల్ని అందుకునేలా.. అభివృద్ధి, ఆరోగ్యం పరంగా, ఆర్థికంగా, ఆనందోత్సాహాల పరంగా.. కొత్త ఏడాదిలో శుభాలు కలగాలని కోరుకుందాం.
పాఠకులు శ్రేయోభిలాషులందరికీ.. ముద్ర 369 డాట్ కామ్ (www.mudra369.com) తరఫున అందరికీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.