Ajay Devgn RRR Oscars బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
తాజాగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అజయ్ దేవగన్ (Ajay Devgn) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలు కూడా, ‘నాటు నాటు’ పాటకు సంబంధించి కావడం గమనార్హం.
‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ పురస్కారం లభించడం.. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) హంగామా కొనసాగుతుండడం తెలిసిన విషయాలే.
Ajay Devgn RRR Oscars.. ‘నాటు నాటు’కి ఆస్కార్.. నా వల్లే.!
కాగా, తన తాజా చిత్రం ‘భోళా’ ప్రమోషన్స్ కోసం కపిల్ శర్మ షోలో పాల్గొన్న అజయ్ దేవగన్ (Ajay Devgn), ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu Song( పాటకి తన వల్లే ఆస్కార్ వచ్చిందని చెప్పడం గమనార్హం.
నాటు నాటు పాటకి అజయ్ దేవగన్ డాన్స్ చేసి వుంటే.. ఆ ఆలోచనే చాలా ఫన్నీగా వుంటుందా.?
అజయ్ దేవగన్ స్వయంగా తన మీద తానే సెటైరేసుకున్నాడు.. తన డాన్సుల విషయమై.!
సెన్సాఫ్ హ్యూమర్ విషయంలో అజయ్ దేవగన్.. అదుర్స్ అంతే.!
Mudra369
‘ఆ పాటలో నేను డాన్స్ చేసి వుంటే ఎలా వుండేదో ఊహించుకోండి..’ అంటూ అజయ్ దేవగన్ (Ajay Devgn) వ్యాఖ్యానించడంతో అంతా ఫక్కున నవ్వేశారు.
‘నేను ఆ పాటలో డాన్స్ చేయలేదు కాబట్టే, ఆ పాటకి ఆస్కార్ వచ్చింది.. అంటే, నేను తెచ్చినట్లే కదా..’ అన్నది అజయ్ దేవగన్ (Ajay Devgn) ఉద్దేశ్యం.
డాన్సుల్లో చాలా చాలా వీక్..
యాక్షన్ సీన్స్‌లో అయితే అజయ్ దేవగన్‌కి (Ajay Devgn) తిరుగు లేదు. ఎందుకంటే, ఆయన యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరూ దేవగన్ తనయుడు మరి.
Also Read: NTR30: మనిషీ.. మృగాలూ.! కొరటాలా ఏం చేస్తున్నావ్.?
కానీ, డాన్సుల్లో మాత్రం చాలా చాలా వీక్. ఆ విషయాన్నే అజయ్ దేవగన్, ‘నాటు నాటు’ పాటని ప్రస్తావిస్తూ సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు.
అన్నట్టు, చాలా సీరియస్ రోల్స్‌లో కనిపించిన అజయ్ దేవగన్‌కి మంచి సెన్సాఫ్ హ్యూమర్ వుందండోయ్.! ఆ సెన్సాఫ్ హ్యూమర్‌ని పలు సినిమాల్లో తనదైన స్టయిల్లో పండించాడు కూడా.!