Nani Dasara Preview.. నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది.
ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ‘దసరా’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాని సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటించింది.
కథేంటి.? అంటే, అదో ఊరి కథ అంటాడు నాని (Natural Star Nani). డీ గ్లామర్ లుక్‌లో సినిమాలోని ప్రధాన తారాగణమంతా కనిపిస్తోంది.
మాస్.. ఊరమాస్.. అన్నట్టుగానే ప్రోమోస్ వున్నాయి. కాన్సెప్ట్ కూడా ఊర మాస్ కాన్సెప్ట్. ఎక్కడా క్లాస్ టచ్ అన్నదే లేదు. కానీ, క్లాస్ మేకింగ్.. అంటున్నాడు నాని.
Nani Dasara Preview.. ఓ ‘ఆర్ఆర్ఆర్’, ఓ ‘కేజీఎఫ్’.. అంతకు మించి..
‘దసరా’ సినిమాపై నాని ఎలివేషన్లు మామూలుగా లేవ్.! ఓ ‘ఆర్ఆర్ఆర్’, ఓ ‘కేజీఎఫ్’.. ఓ ‘దసరా’.. ఇలా చెబుతున్నాడు నాని ‘దసరా’ సినిమా గురించి.

ముందే చెప్పుకున్నట్లు ప్రోమోస్ ఇరగదీసేశారు. అందులో నో డౌట్.! పాన్ ఇండియా కంటెంట్ అనీ నాని చెబుతున్నాడు. అది నిజమేనా.? అన్నది తెరపై చూస్తేనే తెలుస్తుంది.
మేకింగ్ చాలా బావున్నట్లే ప్రోమోస్ ద్వారా అర్థమవుతోంది. ఇంతవరకూ ఎవరూ చూడనంత మాస్ గెటప్‌లో నాని (Natural Star Nani) కనిపిస్తున్నాడు.
కీర్తి సురేష్ ఆల్రెడీ ఓ తమిళ సినిమాలో ఈ తరహా రోల్ చేసేసింది.. సో, ఆమెకు అది కొట్టిన పిండి.! అయినాగానీ, ఆమెది కూడా సర్ప్రైజ్ రోల్.. అంటున్నాడు నాని.
‘దసరా’.. అంతా తానే అయి.!
నిజానికి, ‘దసరా’ (Dasara Movie) సినిమాకి సంబంధించి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నాడు నాని. పబ్లిసిటీ వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు.
దర్శకుడిగా తొలి సినిమానే అయినా, ఎంతో అనుభవమున్న దర్శకుడిలా ‘దసరా’ (Dasara Film) తెరకెక్కించాడంటూ శ్రీకాంత్ ఓదెల గురించి చెబుతున్నాడు నాని.
Also Read: చావనైనా ఛస్తానుగానీ.! మంచు మనోజ్ ఆవేదన వెనుక.!
అంతేనా, ‘దసరా’ కోసం పనిచేసిన అసిస్టెండ్ డైరెక్టర్లకీ అడ్వాన్సులు ఇచ్చేసుకోవచ్చంటూ నిర్మాతలకు నాని సూచిస్తుండడం గమనార్హం.
ఈ ఎలివేషన్లు చూస్తోంటే, ‘దసరా’ వేరే లెవల్.. అనిపించకమానదు. ఇంతకీ, అంత సరుకు ‘దసరా’లో (Dasara Review) వుందా.? ‘పాన్ ఇండియా’ స్థాయిలో సత్తా చాటుతుందా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!