Dasara Collections.. నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ సినిమా శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్.!
సెలవు రోజు కావడంతో, ఓపెనింగ్స్ అదిరిపోయాయి. నాని (Natural Star Nani) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది ఈ సినిమా (Dasara Movie).
తొలి రోజు ఏకంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 14 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది ‘దసరా’ అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లెక్కలు జత చేస్తే, అది మళ్ళీ వేరే లెవల్ అంతే.!
నాని నమ్మకం వమ్ము కాలేదు.!
కొత్త దర్శకుడితో భారీ బడ్జెట్.. ఇటు హీరో, అటు నిర్మాత.. ఇద్దరూ రిస్క్ చేశారు.!
రిస్క్ చేయకపోతే లైఫ్‌లో రస్క్ కూడా దొరకదు మరి.!
వేరే సినిమాలతో పోలికలున్నా.. మిక్స్ టాక్ వినిపించినా..
వసూళ్ళ ప్రభంజనమైతే తొలి రోజు కనిపించింది..
మరి, ఆ ప్రభంజనం కొనసాగుతుందా.?
Mudra369
అంతే కాదు, 2023 సంక్రాంతి సినిమాల్ని పక్కన పెడితే, ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమా ఇదే.!
Dasara Collections.. మిక్స్‌డ్ టాక్ వచ్చినాగానీ..
ఓవర్సీస్‌లో అయితే ‘దసరా’ వసూళ్ళ ప్రభంజనమే కనిపించింది ప్రీమియర్స్ సందర్భంగా.! తెలుగు రాష్ట్రాల్లోనూ ‘దసరా’ ఓపెనింగ్స్ అదిరిపోయాయ్.!
ఈ రోజు శుక్రవారం కావడంతో.. ‘దసరా’ సినిమాకి (Dasara Movie) వసూళ్ళకు సంబంధించి అసలు సిసలు వీకెండ్ ప్రభంజనం ముందు ముందు కనిపించబోతోంది.
కాగా, నానికి సంబంధించినంతవరకు కమర్షియల్ సక్సెస్ పరంగా కెరీర్ బెస్ట్ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అయితే, ఆ సంగతేంటో సోమవారం నాటికి ఓ స్పష్టత వస్తుంది. ఎందుకంటే, తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించినా, ఆ తర్వాత చతికిలపడిన సందర్భాలుంటాయ్.
అదే సమయంలో, తొలి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత అంచనాలకు మించిన విజయాన్ని అందుకున్న సందర్భాలూ లేకపోలేదు.
నాని నమ్మాడు..
ఔను, నాని (Natural Star Nani) బలంగా నమ్మాడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)ని. ఆ నమ్మకం తెరపై కనిపించిందన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.
Also Read: వద్దు బాబోయ్.! త్రివిక్రమ్‌కి మహేష్ ఫ్యాన్స్ వార్నింగ్.!
‘రంగస్థలం’తోపాటు పలు సినిమాల పోలికలున్నాగానీ, మాస్‌కి బాగా ఎక్కేస్తే.. ఆ పోలికల తాలూకు నెగెటివ్ ఇంపాక్ట్ సినిమా వసూళ్ళ మీద వుండదు.